వెలుగు
వెలుగు గురించి మాట్లాడుకోవడమే మనం వెలుగు వైపు పయనించడమనడానికి నిదర్శనం. వెలుగు వున్నచోట చీకటికి తావు లేదని మనకి తెలుసు. కానీ, చీకటి లేకపోవడమే వెలుగని మనలో చాలా మందికి తెలీదు. ఈ రెండింటికీ వ్యత్యాసం చాలా తక్కువగా మనకి అనిపించవచ్చు. కానీ, చాలా ఎక్కువ. ఆ ఎక్కువ గురించి మనకి తెలిస్తే బహుశా మనకి అంతా (అంతా)తెలిసి పోయినట్టే. మనం వెలుగులో, వెలుగు కేంద్రంలో నిల్చున్నట్టే. విషాదాన్ని విడిచిపెట్టినట్టే. నిజమేనంటారా?