ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, September 18, 2008

అహంకారి (కథ)...3

(భార్యాభర్తల మధ్య సున్నితమైన మానసిక సంబంధాల మీద అల్లబడి, జూన్ నెల 'పొద్దు' ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడిన నా కథ)

అహంకారి (కథ)...3

సురేఖ విచిత్ర విడాకుల ఉదంతం విని నేను నిర్ఘాంతపోయాను.

మానవ సంబంధాలు, విలువలలోని ఔచిత్యం, సున్నితత్వం గురించి నేను తెలీనివాడ్ని కాదు. అయినా సురేఖ వైవాహిక జీవితం పరిశీలించాక నాకవన్నీ మళ్ళీ మరింత విశదంగా భోదపడినట్టయింది. మనం తప్పు చేయకపోవడం పెద్ద గొప్పనుకుంటాం. కానీ కాదు. ఆవతలి వ్యక్తులు మన చర్యలకి ఏ విధంగా స్పందిస్తున్నారో, ఏ విధమైన బాధననుభవిస్తున్నారో గ్రహించుకుని మసలుకోవడం అంతకన్నా గొప్పగా, ముఖ్యంగా నాకు తోచింది.

అంతలోనే సురేఖ, “ఇప్పుడు చెప్పు. నేను చేసింది తప్పంటావా?” అంది. ఆపైన, పక్కకి తొలగిన చున్నీని వతైన ఛాతీ మీదికి లాక్కుంది.

నేనామె ప్రశ్నకి సమాధానం యివ్వకుండా, “ఇంతకీ ఏ కారణాలతో అంటే ఏ ‘గ్రౌండ్స్’ ని ఆధారం చేసుకుని యిచ్చింది నీకు కోర్టు విడాకులు?” అన్నా.

“ఏదో! చెత్తాచెదారం. అన్నీ అబద్దాలే. ఆ లాయరు చెప్పమన్నవన్నీ కోర్టులో చెప్పాను. మొత్తం మీద సుబ్బారావుని చేయకూడనంతటి దోషిని చేస్తేనే వచ్చాయి విడాకులు.” అందామె బాధగా.

ఎవరో పనిగట్టుకుని తీర్చిదిద్దినట్టుండే సురేఖ మృదువైన పెదాలు అసత్యాలు పలికి, అసలుని నకిలీ చేయడం నాకు నచ్చలేదు. అందుకే__

“సుబ్బారావుని దోషిని చేయడం నీకు తప్పనిపించలేదూ?” అడిగాను.

“అనిపించింది. కానీ అలా అనుకుంటూ పోతే నాకు విముక్తి లభించదే. అయినా నాకు తెలిసిందొక్కటే. ముందు నా జీవితం నాకు ముఖ్యం. నా మనసు__ దాని బాగోగులు__ దానికి నొప్పి కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, నాదేనని నా ప్రగాఢ నమ్మకం. నా జీవితానికీ, నా మనసుకీ, సుబ్బారావు బాధలతో నిమిత్తం ఉందని నేననుకోను. ఇక మా బాబు జీవితం అంటావా? వాడికేం? సుబ్బారావు జీవించివున్నంత కాలం వాడికేలోటూ వుండదు!” అంది నమ్మకంగా.

“పోనీ, నువ్వు ప్రపంచానికి సుబ్బారావుని దోషిగా చూపడం అతడికి కోపం తెప్పించలేదా?”

“లేదు. కోర్టు విడాకులకు అనుమతిచ్చిన రోజు రాత్రి సుబ్బారావు మా యింటికొచ్చాడు. నన్ను పట్టుకుని పసివాడిలా వలవలా ఏడ్చాడు. నేను లేకుండా జీవించలేనన్నాడు. తన బిడ్డని తల్లిలేనివాడిగా చేయొద్దని వేడుకున్నాడు.”

“నువ్వేమన్నావు?”

“అతడ్ని కోర్టుకీడ్చి విడాకులు సంపాదించిన దాన్ని ఏమంటాను? కుదరదన్నాను. విసిగించకుండా వెళ్ళమన్నాను. ఏం చేయగలడు సుబ్బారావు? అలాగే ఏడుస్తూనే, బాబుని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. బాబు కూడా వెళ్తుంన్నంతసేపూ నన్ను చిత్రంగా చూస్తూనే వున్నాడు. ఆ దృశ్యం చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఆ తర్వాత, రెండురోజులపాటు ఏడుస్తూనే గడిపాను.” అంది సురేఖ. ఆమె కళ్ళలో కన్నీరు పొంగింది. మళ్ళీ తనే __

“చెప్పు! నేను చేసింది తప్పేనంటావా?” అడిగింది.

ఆమెకి తన ప్రవర్తన కొంత అనిశ్చితికి గురిచేసినట్టుంది. తన ప్రవర్తనలోని మంచిచెడుల్ని నిగ్గుదేల్చుకునేటందుకు ఆమె నా అభిప్రాయానికి స్వాగతం పలుకుతూ, ఆతృత కనబరుస్తోంది. ఎందుకంటే సురేఖ దృష్టిలో నేనొక పరిణతి చెందిన వ్యక్తిని. అందుకే __

“ఏం చెప్పను సురేఖా. కవితలల్లీ, రచనలు చేసీ, విలువలేమిటో కళాత్మకంగా పదిమందికీ వివరించగలదానవు. మనసు కష్టపెట్టుకోడం తప్పని తెలుసుకునే స్థాయికి ఎదిగిన స్త్రీవి. మనసు__ దాని పరిమితులెరిగిన వాడిగా నీకు తప్పుని ఆపాదించలేను. అలాగని, జీవితం ప్రాక్టికాలిటీతో, జీవించడంలో వున్న సౌందర్యంతో అంతటి నీ కళాహృదయాన్ని సైతం అథః పాతాళానికి తొక్కేయగలిగిన సుబ్బారావు క్రమశిక్షణనూ నేను తప్పు పట్టలేను.” అన్నా.

సురేఖ మాట్లాడలేదు. కానీ, నా మాటలు చాలా శ్రద్ధగా ఆలకిస్తోంది.

మళ్ళీ నేనే__ “వ్యక్తులు విప్పిచెప్పుకోలేని తప్పొప్పుల్ని కాలం, భవిష్యత్తూ విశదపరుస్తాయంటారు. చూద్దాం. అంతవరకూ మనం వేచివుండక తప్పదు.” అంటూ వెళ్ళడానికన్నట్టు లేచాను.

* * *

ఓ ఏడాది గడిచింది.

మళ్ళీ సురేఖ నుండి అర్జంటుగా విజయవాడ రమ్మని నాకు ఫోనొచ్చింది. ఏదో ఒక విశేషమైన పని లేనిదే సురేఖ నన్ను విజయవాడ రమ్మనదు. ఉన్నఫళాన బయలుదేరి విజయవాడ చేరా. సురేఖని వాళ్ళింట్లో కలుసుకున్నా.

నేను వెళ్ళేసరికి సురేఖ మంచమీద పడుకుని వుంది. ఎప్పుడూ లేనిది ఆమె ఈసారి చీర కట్టుకుని వుంది. ఏదో సుస్తీ చేసిన దానికి మల్లే ఆమె శరీరం నీరసంగా వుంది. నన్ను చూడగానే మంచంమీంచి బలవంతంగా లేవలేనట్టుగా లేచి కూర్చోబోయింది. ఆమె వాలకంలో ఏదో కృత్రిమత్వం తోచి నేను వలదని వారించాను. ఆమె మళ్లీ పడుకుంది. అంత నీరసంలోనూ నన్ను చూసిన ఆనందం ఆమె ముఖంలో కన్పిస్తూనే వుంది. మొదటగా__

“బావున్నావా?” అంది. పమిటని గుండెలమీదికి సర్దుకుంటూ.

“బాగానేవున్నా.” అన్నా.

“బానేవుంటావులే. కష్టాలు పడను నన్ను కట్టుకోలేదుగా.” విషాదంగా నవ్వింది.

“ఏంటా మాటలు. అసలేమయింది నీకు?” అన్నా.

“ఏమవుతుంది? నువ్వప్పుడో మాటన్నావు గుర్తుందా? మనుషులు తేల్చుకోలేని సమస్యలు భగవంతుడే తేలుస్తాడని---గుర్తుందా?” అంది సురేఖ. స్వేదంతో ఆమె శరీరం తడిసింది. జాకెట్టుకీ, చీరకీ మధ్యభాగంలోని నడుము భాగం రెట్టింపు కాంతితో నాజూగ్గా కన్పిస్పోంది.

“భగవంతుడని నేననలేదు. కాలం అన్నాను.” అన్నా.

“ఏదో ఒకటిలే. అదిప్పుడు తెలిసొచ్చింది నాకు.” అందామె.

“ఏమైంది నీకు?” అడిగా భయంగా.

“పాపిష్టిదాన్ని నాకేమవుతుంది? సుబ్బారావుకే పాపం మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. నావల్ల ఎంత వేదన అనుభవించాడో ఏమో?” కన్నీరు ఆమె కనతలమీది నుంచి చెవులమీదికి కారుతోంది.

నేను చలించిపోయా. “మూత్రపిండాలెందుకు దెబ్బతిన్నాయి సుబ్బారావుకి?” అన్నా అసంకల్పితంగానే.

సురేఖ మళ్ళీ నవ్వింది. “ఆర్నెళ్ళ పసివాడికి కాన్సర్ ఎందుకొస్తుందంటే ఏం చేపుతావు? సుబ్బారావు కూడా పసివాడే కదా! అందుకే వచ్చుంటుంది.” అంది కాళ్ళు ముడుచుకుని. చీరని పాదాలమీదికి లాక్కుంది. పాలవంటి ఆ తెల్లటి పాదాల దగ్గర బంగారు రంగు పట్టీలు మెరుస్తున్నాయి.

“అయితే ఏమంటున్నారు డాక్టర్లు?”

“ఏమన్నారు? అతడు బ్రతకడానికి మూత్రపిండం కావాలన్నారు. ఎవరిస్తారు సుబ్బారావుకి. అందుకే నేనే యిచ్చా.” అంది సురేఖ.

“నువ్విచ్చేవా మూత్రపిండం సుబ్బారావుకి?” బాధగానూ, ఆశ్చర్యంగానూ అడిగా.

“మరి నేనతడి దేవతని కదా నేనివ్వక మరొకరినివ్వనిస్తానా?” అని, మళ్ళీ తనే స్వగతంలో అనుకుంటున్నట్టుగా, “సుబ్బారావు ప్రేమని సంపాదించగలిగిన నేనెంతటి ధన్యురాలిని?” అంది.

“అయితే యిప్పుడెలా వుంది?” అన్నా ఆతృతగానే.

“ఆయనకేం మహారాజు. వెంటనే కోలుకున్నాడు. నాకే గ్యారంటీ లేదన్నారు డాక్టర్లు.”

“ఏమన్నారు?” శరీరం గగుర్పాటు చెందగా ప్రకంపించిపోతూ అడిగాను.

“బ్రతకనన్నారు. చూసేవా? కంటి ఆపరేషన్ లో నెగ్గుకు రాగలిగేను గానీ ఇక్కడ ఓటమి తప్పలేదు.”

నా చిరకాల నేస్తం మృత్యువు పాలవబోతుందన్న విషయం నన్ను నిర్వీర్యుడ్ని చేసింది. శోకోన్మత్తత నా శరీరాన్ని ముప్పిరిగొనగా నేనామె తల దగ్గర కూర్చుని ఆమె నుదుటిమీద చెయ్యేశా.

సురేఖ నవ్వింది. “చూశావా! నీలో ప్రేమని ఈనాటికి నాతో చెప్పుకోగలిగావు.” అంది__ నా చేతిని తన రెండు చేతుల్తో ఆప్యాయంగా పట్టుకుంది.

నేను నాచేతిని గబుక్కున లాక్కోబోయి, ఏదో అనుమానం వచ్చినవాడిలా ఆమె కళ్ళలోకి చూశాను.

“నీ ప్రేమ గురించి నాకు తెలుసు. నా ఈ శరీరం మీద నీకున్న వ్యామోహం, ఆకర్షణ ఎంత బలమైనవో కూడా నాకు తెలుసు.” అంది సురేఖ.

కన్నీరు తుడుచుకుంటూ ఆమె వైపు చిత్రంగా చూశా.

“నిజమే. ఓ పదినిముషాలపాటు ఈ శరీరాన్ని నీకు అర్పించుకునివుంటే ఈ ప్రపంచానికేం నష్టం. నాకూ పోయేదేముందిగానీ, ఆ పని చేయను ఈ శరీరం మీద నాకేం అధికారం వుందని. ఈ శరీరం నాదీ నీదీ కాదు. సుబ్బారావుదే!” అంది మళ్ళీ కన్నీరు పెట్టుకుంటూ.

నేనేమె వైపు నిశ్చలంగా చూస్తున్నాను.

“కోర్టులకెళ్ళి మంచోళ్ళతో విడివడిపోవడమే తెలుసుగానీ మొద్దుమాలోకం ఈమెకేం తెలుసు ప్రేమ గురించి అనుకుంటున్నావు. కదూ?” తల పక్కకు వాలుస్తూ ప్రశ్నించింది. మెడ ప్రక్కన పుట్టుమచ్చ ఆమెమీది ప్రేమతో అక్కడే ఆమె చర్మాన్ని కౌగిలించుకుని అందంగా కన్పించసాగింది.

‘కాద’న్నట్టు తలూపాను. అంతటి బాధలోనూ.

“నిజంగానే నాకు తెలీదు. పెళ్ళయినాక సుబ్బారావే చెప్పాడు ఒకరోజు. నీ కళ్ళూ, నీ చూపులూ, నన్ను ఆరాధించే తత్వం కలిగివుంటాయట. నువ్వు కూడా తనలాగే నా భక్తుడివట. భర్త ఎవరైనా భార్యకట్లా చెపుతాడా? అంతటి ఉదార హృదయుడూ, మంచివాడూ, తెలివైనవాడూ సుబ్బారావు.” అంది.

అంత విషాదంలోనూ నేను దిగ్భ్రాంతికి గురయ్యా.

సురేఖ మాట్లాడుతూనే వుంది.

“చూశావుగదూ? ఎన్ని కన్నీళ్ళు పెట్టించాను సుబ్బారావు చేత! అవన్నీ యిప్పుడు నన్ను చుట్టుముట్టాయి” అంది-- కన్నీటిని వ్రేలితో తొలగిస్తూ.

పశ్ఛాత్తాపంలో ప్రక్షాళన పొంది ఆమె కన్నుల నుండి జాలువారుతున్న అశ్రుధారలు అవి. నాకెందుకో అవి నాకలా అన్పించలా. పవిత్ర తీర్ధంలా తోచాయి.

“నేను సుబ్బారావుతో విడిపోయినందుకు పశ్ఛాత్తాపపడుతున్నా ననుకుంటున్నావు నువ్వు. లేదు. ఆ విషయంలో నేనెప్పటికీ వెనక్కిచూసుకోడమనేది లేదు. స్త్రీ అనే పదం యిక్కడెందుకుగానీ, వ్యక్తిగా అతడితో సంబంధం వదులుకుని నేను నా ఆత్మగౌరవం కాపాడుకున్నాననే భావిస్తా. మరి ఈ ప్రేలాపన, ఈ మూత్రాపిండాల దానం యివన్నీ ఎందుకంటావా? మానవత్వంగల మనిషిగా నా క్షేమంకోసం పరితపించిన సుబ్బారావు మీద నాకు అచంచలమైన భక్తి. అలాగే దయ కూడా” సురేఖ దుఃఖాన్ని నిగ్రహించుకుంది. “అన్నట్టు నిన్నెందుకు పిలిపించానో తెలుసా?” అడిగింది.

“తెలీదు.” అన్నా.

“సుబ్బారావుకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అతడు బతుకుతాడు. నాకు తెలుసు. కానీ, ఒకవేళ దురదృష్టం వెన్నాడి అతడికేదైనా అయితే. . .?” సురేఖ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.

“ఏదైనా అయితే బాబు బాధ్యత నన్ను తీసుకోమంటావు. అంతేకదా?” అనడిగా.

“అంతేగాదు. బాబు పేరు కూడా మార్చాలి నువ్వు.”

“అలాగే. ఏం పేరు పెట్టమంటావు చెప్పు.” అన్నా. వంగి, అనునంయంగా ఆమె తలమీద చెయ్యేస్తూ.

“ఇంకేం పెడతావు? సుబ్బారావని పెట్టు. అంతకుమించిన అందమైన పేరు తెలుసా నాకీ లోకంలో. తండ్రి గుణంలో సగం లక్షణాలొచ్చినా చాలు. మెరుపులా బ్రతికేస్తాడు నా బాబు.” అంది సురేఖ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

“అలాగే. సురేఖా!” అన్నా__దుఃఖోద్విగ్నుడనై ఓదార్పుగా ఆమె చేతుల మీద నేను చేయ్యేస్తూ.

క్షణం తర్వాత సురేఖ మళ్ళీ, “నేను ఇతివృత్తం చెబితే కథ రాస్తానంటావుగా. ఇప్పుడు రాయి కథ” అంది.

ఆమె చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడలేదు.

మళ్ళీ సురేఖే అంది. “నా బ్రతుకే నీ కథకి ఇతివృత్తం. రాయి. బహుశా మంచి కథవుతుందనుకుంటా” అటువేపు తిరిగి కన్నీరు విడిచింది.

నేను మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె మాట నాకేమీ తప్పుగా అన్పించలా. నిజంగానే జీవితాన్ని కథకి కావలసినంత అతిశయంతో నింపుకుంది సురేఖ. కాదంటారా?

(నా కథలు చదివి, అభినందించి, నన్ను ప్రోత్సహించి, ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాచేత కథ రాయించిన “కల్హార” బ్లాగు రచయిత్రి ‘స్వాతి’గారికి కృతజ్ఞతలతో¬__రచయిత)
( సమాప్తం )

32 అభిప్రాయాలు:

Srikanth said...

నిజం చెప్పాలంటే రెండో భాగం చదవగానే ఆత్రుతతో
పొద్దులో ఈ టపా చదివేసాను

వివిధ మనస్తత్వాలున్న వ్యక్తుల్ని చాలా అద్భుతంగా రాసారనిపించింది
చిన్న మనవి- మీరు ఇంక ఎప్పుడూ రాయటం ఆపకండి

MURALI said...

నేను ఈ మధ్య కాలంలో చదివిన గొప్ప కధండి ఇది. వాస్తవికతకి అతి దగ్గరలో ఉన్న వృత్తాంతం అద్భుతంగా ఉంది. పాఠకుడ్ని బలంగా తనలోకి లాక్కుని తనతో పాటు నడిపించిన కధనం చాలా బాగుంది.

MURALI said...

ఇది వాస్తవకధ కాదుకదా?

వింజమూరి విజయకుమార్ said...

వాడరేవు శ్రీకాంత్ గారికి,

కథ అద్భుతంగా వుందన్నారు. మీ వ్యాఖ్య నాకు ఎంతైనా స్ఫూర్తిదాయకం. మీరన్నట్టు ఎప్పుడూ రాయడానికే ప్రయత్నిస్తాను. మీ వంటి పాఠకులు లభించడమూ నా లాంటి వారి అదృష్టమే కదా. కృతజ్ఞతలు.

వింజమూరి విజయకుమార్ said...

మురళి గారికి,

మీ వ్యాఖ్య నాకు కొండంత బలాన్నిచ్చింది. ఇది జరిగిన కథ కాదు గానీ నేను విన్న ఒక సంఘటన అదే లేజర్ ట్రీట్ మెంటు విషయం కథలో వాడుకోవడం జరిగింది. ధన్యవాదాలు.

మోహన said...

ఏం చెప్పమంటారూ..?

జీవితంలో నిలుపుకోవలసినవి, విడిచిపెట్టాల్సినవి ముందుకు తీసుకెళ్ళాల్సినవీ, వదిలించుకోవాల్సినవీ.. ఇలా కంటతడి పెట్టేలా చెప్పాకా.. ఇంకా.. నన్ను ఏం చెప్పమంటారూ..??

ఇలాంటి కథలు మీరు మరిన్ని రాయాలని, అవి.. వీలైనంత మందికి, అందునా వాటి అవసరమున్న వారికి తప్పకుండా చేరుకోవాలని ప్రార్థిస్తున్నాను.

వింజమూరి విజయకుమార్ said...

మోహన గారికి,

మీలాగే ఈ కథకి చాలా మంది బాగా స్పందించారు. అందరూ మరిన్ని కథలు రాయమనే కోరారు. మీ అభిమానానికి కృతజ్ఞతలతో ఇటువంటి కథలు మరిన్ని రాయడానికి ప్రయత్నిస్తానని మనవి చేసుకుంటన్నాను.

Anonymous said...

Adbhutam Eee Kadha. Nenu Eeemadhya Ituvanti Kadha chadavaledu. Ituvantivi Andaru Rayaleru. Nenu mee FAN ayipoya Eee Kadha Chadivi. Thanks. Meetho chaala vishayalu matladali. Meeku Abhyamtaram lekapothe Malli kalusha meetho Maillo. Vuntanandi.

కథాసాగర్ said...

బాగా రాసారండి.

Anonymous said...

అన్నా నువ్వు బ్లాగులు ఎందుకు రాస్తలేవు. ఇంకోపాలి షురువు జెయ్యమని నా విన్నపము

కొండముది ప్రసన్నలక్ష్మి said...

ఈ బ్లాగు నేను ఈ మధ్యనే చూడడం జరిగింది. కొన్ని టపాలు అద్భుతంగా అన్పించాయి. అహంకారి కథ చదివాక చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి కథ చదివానన్న తృప్తి కలిగింది. అన్నట్టు మీ వంటి రచయితలు కథలు తరచుగా ఎందుకు రాయరో నాకు అర్థం కాదు. దయచేసి మరిన్ని రచనలు చేయగలరు.

Rao S Lakkaraju said...

వళ్ళు జలదరించింది. మాటలు రావటల్లేదు. ఎంతో పవర్ఫుల్ గ ఉంది. థాంక్స్.

లక్కరాజు శివరామకృష్ణారావు

అశోక్ కుమార్ వంగర said...

కథ కంట తడిపెట్టించింది. కథ,కథనం,కథని నడిపించిన తీరు బాగుంది.

లక్ష్మి said...

కథ వాస్తవికంగా ఉండడంతో పాటు ఏకబిగిన చదివంపజేసింది. ద్వైదీ భావంతో సతమతమయ్యే కథానాయిక మనస్తత్వ చిత్రణ బాగుంది.

కొనవోలు భారతి said...

ఇందులో సుబ్బారావు అహంకారి అన్నట్టు సురేఖ చేత చెప్పించారు.కానీ కథ చదివితే సురేఖలో అహంకారం కన్పిస్తుంది.ఇంతకీ ఎవరు అహంకారో అర్థంగాకపోయినా కథని రక్తి కట్టించారు.సూపర్బ్.

Madhav Rao said...

Mr. Vinjamuri,
It is not good to take long intervals from post to post because the readers will be lost good Stories and posts.

Suma Grandhi said...

Subba Rao vanti bhartha dorakadam adrushtam Ee sthreekaina Ee rojullo. Okavela dorikite evaru vadulukoru. Kaani advalla kastalu telusikuni rasaaru. thanx.

మాధవి said...

పైన భారతిగారితో నేను ఏకీభవిస్తున్నాను.అయినా కథ హృద్యంగా వుంది.

బాలకృష్ణ said...

మంచి చెడులకి అతీతంగా సాగిన కధ బావుంది. వ్యక్తిత్వ చిత్రణ చాల బావుంది. కధ త్వరగా ముగించాలన్న తొందర మూడో భాగంలొ కనిపించింది. మూడొ భాగం కొన్ని aspects లో గోపిచంద్ గారి technique ను గుర్తుకి తెచ్చింది. డీనిని పొగడ్త గా తీసుకోమని విన్నపం. మీరు చాలా మంచి కధకులు. కధలు రాస్తూ ఉండండి. ఈ కధని చాలా ఆలస్యంగా చూసాను.
వీలైతే నా blog : http://samaditti.wordpress.com/ చూడండి.

రమ్య గుడిపూడి said...

నేనొక సాహిత్యాభిలాషిని. ఈ మాత్రం కథ నేనీ మధ్యకాలంలో చదవలేదు. మీరింకా ఇలాంటి కథలు రాస్తూండండి.

Anonymous said...

నా పేరు చెప్పలేను కానీ యాదృచ్చికమో ఏమో గానీ ఈ కథలో లానే నేను నాభర్తతో విడాకులు తీసుకున్నాను. మీ కథలో లాగా ఒకట్ రెండు చోట్ల నా జీవితంలో కూడా పోలిక ృలున్నాయి. ఈ కథ చదివినంతసేపూ ఏడుస్తూనేవున్నాను. ఇటువంటి కథలు రాసితే మంచి రచయితలవుతారని నా నమ్మకం. మీకు నమస్కారాలు. ఇంతమంచి కథ రాసినందుకు...

రమణ కంకిపూడి said...

కథ విభిన్నగా వుండి మనసుని కలచివేసింది.

Latha said...

ఇంతమంది చెప్పిం తర్వాత నేను చెప్పేదేమీలేదు గానీ కథలో శిల్పం, మానసిక విశ్లేషణ బాగున్నాయి. కథ కంట తడి పెట్టించింది.

kirankumarvakada said...

hi vijay kumar,
me story chala heart touching ga vundi.
wife and husbend relation ela maintain cheyalo,ala cheyaka pothay emi jaruguthundo chala baga rasaru.
kakapothay chinna advise,
intha heart touching story lo,lady character antha diprassion lo vunnappudu kuda meeru tana andhanni varnincharu.
dani valla story lo vunday feel miss ayyay chance vundani anukuntunannu.
any way story chala bagundi.
meeru ilanti stories inka rayalani manasara korukuntunannu.

టేకుమళ్ళ సుజాత said...

“ఇంకేం పెడతావు? సుబ్బారావని పెట్టు. అంతకుమించిన అందమైన పేరు తెలుసా నాకీ లోకంలో. తండ్రి గుణంలో సగం లక్షణాలొచ్చినా చాలు. మెరుపులా బ్రతికేస్తాడు నా బాబు.” ఈ వాక్యాలు చాలు ఈ కథ ఎంత గొప్పదో చెప్పడానికి. సూపర్బ్ వింజమూరి గారూ.

Ratna. R. said...

భళారా భళి విజయకుమారా అదిరింది కథ. హేట్సాఫ్.

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి said...

బాగు౦ది

http://bhamidipatibalatripurasundari.blogspot.in/

Telugu Vilas said...

its a nice information blog
The one and the only news website portal Telugu vilas .
please visit our website for more news updates..
Telugu vilas

Creative Channel said...

నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
నా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను

మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow

Latest Tollywood News said...

very interesting, good job, and thanks for sharing such a good blog.

please visit our website for more news updates
Latest Tollywood News

Anonymous said...

విజయకుమార్ గారు మీరచనలో జీవం ఉట్టి పడుతుంది రాసిందేదైనా జీవన్నీ నింపుకొని చదువరులకు హృదయం ఆత్రుత ఆనందం తో వెలిగి పోతుంది, భూమి గురించి ఆలోచించండి అన్ని మనం భూమినుండే నేర్చువాలి సకల జీవలు దేవుళ్ళు మనవత్వం మనిషి మనుగడ

Anonymous said...

ఆది మానవుల నుండి ఇప్పటివరకు మానవుని మార్పులు మనుగడ గురించి మంచి రసవత్తారమైన కధకు నాది పలకండి imam