ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Showing posts with label నా ఫోటో. Show all posts
Showing posts with label నా ఫోటో. Show all posts

Saturday, June 28, 2008

'పొద్దు'లో నా కథ 'అహంకారి'

భార్యాభర్తల సునిశితమైన మానసిక సంబంధాలపై అల్లిన నా కథ 'అహంకారి' 'పొద్దు'లో 26-07-2008 న ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన! కథ కోసం http://poddu.net/ చూడగలరు. ఇప్పుటికే ఈ కథ చదివి తమ విలువైన అభిప్రాయాలు తెలియజేసిన శ్రీ చావా కిరణ్ గారికి, శ్రీనివాస్ గారికీ,ఏకాంతపు దిలీప్ గారికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

కృతజ్ఞతలతో. . .
మీ. . వింజమూరి విజయకుమార్

Saturday, May 3, 2008

విరామం!

వ్యక్తిగతమైన, వృత్తిపరమైన కారణాల వల్ల ఓ ఇరవైరోజులపాటు నేను బ్లాగ్విరామం తీసుకుంటున్నాను. దయతో ఆదరించగలరని ప్రార్థిస్తున్నాను. అలాగే "గ్లోబల్ వార్మింగ్" ప్రమాదం దృష్ట్యా మనకోసం, మన పిల్లల భవిష్యత్తుకోసం ఈ రోజు సాయంత్రం 7-30 నుంచి 8-30 మధ్య "ప్లగ్ ఆఫ్" కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా నేను చదువరులందరినీ వేడుకుంటున్నాను.