ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, June 28, 2008

'పొద్దు'లో నా కథ 'అహంకారి'

భార్యాభర్తల సునిశితమైన మానసిక సంబంధాలపై అల్లిన నా కథ 'అహంకారి' 'పొద్దు'లో 26-07-2008 న ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన! కథ కోసం http://poddu.net/ చూడగలరు. ఇప్పుటికే ఈ కథ చదివి తమ విలువైన అభిప్రాయాలు తెలియజేసిన శ్రీ చావా కిరణ్ గారికి, శ్రీనివాస్ గారికీ,ఏకాంతపు దిలీప్ గారికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

కృతజ్ఞతలతో. . .
మీ. . వింజమూరి విజయకుమార్

1 అభిప్రాయాలు:

Purnima said...

మీ కథ నాకు నచ్చింది. "ఇది నా జీవితం.. పూర్తిగా నా వ్యక్తిగతం" అని అనుకుని క్షణికావేశం అయితే బంధాలను లేకపోతే మనుషులనో చంపేస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి వారు ఒక్క క్షణం ఆలోచిస్తే తమతో ఎన్ని జీవితాలు పెనవేసుకుపోయాయో తెలుస్తుంది.

మొన్నీ మధ్య మా స్నేహితురాళ్ళతో ఎదో చర్చ వచ్చి.. "Financial Indepedence ఉందంటూ అమ్మాయిలూ బంధాలలో ఇమడలేకపోతున్నారు" అని నా అభిప్రాయం చెప్పా.. దానికి సరిగ్గా తూగినట్టు ఉంది మీ కథ.

"కవితలల్లీ, రచనలు చేసీ..." అంటూ మీ నాయికను ప్రొజెక్ట్ చేయడం నచ్చింది. ఊహాలోకం అందంగానే ఉంటుంది, మనం మాత్రమే నిర్మించుకుంటాం గనుక. నిజజీవితంలో "నా", "నీ", "మన" అన్నింటికీ విలువ ఇవ్వాలి. అందుకే అది క్లిష్టమైనది.. అందమైనది.

ఓ మంచి అనుభూతి మిగిల్చింది మీ కథ. అభినందనలు.

పూర్ణిమ