వెలుగు
వెలుగు గురించి మాట్లాడుకోవడమే మనం వెలుగు వైపు పయనించడమనడానికి నిదర్శనం. వెలుగు వున్నచోట చీకటికి తావు లేదని మనకి తెలుసు. కానీ, చీకటి లేకపోవడమే వెలుగని మనలో చాలా మందికి తెలీదు. ఈ రెండింటికీ వ్యత్యాసం చాలా తక్కువగా మనకి అనిపించవచ్చు. కానీ, చాలా ఎక్కువ. ఆ ఎక్కువ గురించి మనకి తెలిస్తే బహుశా మనకి అంతా (అంతా)తెలిసి పోయినట్టే. మనం వెలుగులో, వెలుగు కేంద్రంలో నిల్చున్నట్టే. విషాదాన్ని విడిచిపెట్టినట్టే. నిజమేనంటారా?
2 అభిప్రాయాలు:
Cheekati leka pote veluguku arthame ledu. Suuryunni teesestey migilinadantaa cheekatey.. Cheekatilo unnappude velugu viluva telustundi.
Kaani cheekati teliya chesey ennoo nijaalu velugulo teliyavu. Meeru Bhoutikamga raasaaro, leka philosophical ga teleedu kaanii, velugukannaa cheekate manani munduku nadipistundi.. Aalochimpa chestundi.. anipistundi.
Velugu chaalaa baguntundi. Jeevana paramaartham adey.. Kaanii aa velugu kindey ennenno cheekatlu ponchi untaayi.
Ee jeevitamlo edii sasvatam kaadu ane maata nijamaitey.. Velugu kuudaa sasvatam kaadeemo anipistundi.
Nenu niraasaavaadini kaanu. Cheekati vaadinii kaanu. Vishaadam manalo kalagachesenta paripakvata aanandam kalaga cheyaledu.
Idi naa abhipraayam maatrame..
Thanx..
అనోనిమస్ గారికి,
అయ్యా/అమ్మా, కృతజ్ఞతలు. నేను ఫిలసాఫికల్ అర్ధంతో వెలుగు గురించి రాసాను. ఉదాహరణకి ఆలోచనని చీకటి అనుకుందాం. ఆలోచన లేకపోవడమే, అంతరించడమే, నశించడమే వెలుగు అదే సత్యం. ఆ ఆలోచన నశింపజేయడం ఎలాగో తెలుసుకోవడం జీవిత పరమార్ధం. నా టపాల్లో వీలైతే భావాతీతథ్యానం గురించి చదవండి. మీ సందేహం విడిపోతుంది. ఉంటాను.
Post a Comment