ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, August 25, 2007

జై కిసాన్! (కవిత)

కిసానులు --సానులు! (కవిత)

సరిగమలు. . . జంట స్వరాలు. . .
స్వరజతులు. . . జతిస్వరాలు. . .
సంకీర్ణ రసాలు. . . పలికే. . . పలికించే. . .
మృదుమధుర. . . స్వరమృదుల రాగాల వీణలో. . .
తీగలు తెగుతున్నట్టూ. . .!!!

ప్రసవించిన పసికందును. . .
నడి గుండెన అదిమి పట్టి. . .
పాలుగుడిపే అమృతమూర్తి. . .అమ్మ. . .
అమ్మ రొమ్మును. . .
బ్రెస్ట్ క్యాన్సర్ ఆక్రమిస్తున్నట్టూ. . .!!!

రైతు చస్తున్నాడయ్యా. . .!
ఓ నా పాలకవర్గ మేధావీ. . .!!
రైతు ఛస్తున్నాడు!!!

చచ్చినవారి పట్ల. . .
మన ముష్టి సంతాపం. . .
ముదనష్టపు ఏడ్పులూ. . .

కాదిప్పుడు అవసరం. . . లేదిప్పుడు అవసరం. . .!!!

కృతిపాడే వాగ్గేయుడొకడు. . .
శృతి తప్పిన కంఠాన్ని. . .
చిని పొడిదగ్గుతొ. . .
గొంతుని సవరించినట్టూ. . .!!!

విద్య గరిపే గురువరుడొకడు. . .
చింతబరికతొ శిష్యుడి అజ్ఞాన తిమిరాన్ని. . .
తరిమి. . . తందరిమి కొట్టినట్టూ. . .!!!

బ్రతికున్న శవాల బ్రతుకులకో పరిష్కారం కావాలి!!!

అది. . . ఆ పరిష్కారం. . .

నా ‘కిసాను’ల భార్యలు. . . కూటికోసం ‘సాను’లు కాకుండేందుకు. . .
తోడ్పడగలగాలి!!!


* * *

2 అభిప్రాయాలు:

GKK said...

మీ ఆర్తి అర్థవంతమైనదే అన్నియ్యా. కానీ కవితారచన ఇంకా పదునెక్కాలి. ఉదా. మొదటి భాగంలో విషయం తక్కువగా , అనవసర పద ప్రయోగాలు ఉన్నాయి. అల్లాగే సమస్య పరిష్కారానికి ఉపయోగించిన పోలికలు ఏమంత బాగాలేవు.

Unknown said...

వింజమూరి విజయకుమార్ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి

- హారం ప్రచారకులు.