జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..4
జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!
“చూశారా! నేను జీనో పేరడాక్సుల మాయా పద్మవ్యూహపు ముడులు సైతం విప్పగలుగుతున్నాన”నే భేషజం కోసమో, మహోజ్వలమైన, విలక్షణమైన గ్రీకు తత్వశాస్త్ర చరిత్రలో ‘కలికితురాయి’ లాంటి ‘జీనో’ వంటి మహోన్మహుడ్ని కించపరచాలనుకోవడమో ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. ఒక సామాన్యుడనైన నేను గ్రీకు తత్వశాస్త్రానికే ప్రౌఢ గాంభీర్యాన్ని అలిమి, కొత్త పుంతలు తొక్కించిన జీనో వారికి ఏ మాత్రం గానూ, మరే విధంగానూ సాటిరాను. కాకుంటే ఒక తత్వవేత్త ఒక విషయాన్ని తన తర్కం ద్వారా నిరూపణకి తీసుకువచ్చినప్పుడు, అతడు తద్వతిరేకమైన వాదనలో ఏ విషయాలు విస్మరించాడో ప్రపంచానికి తెలియచెప్పే భావప్రకటనా స్వేచ్ఛ ఈ లోకంలో ప్రతివారికి లాగానే నాకూ వుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం. దానికి తగ్గట్టుగానే ఆనాడు “విశ్వదర్శనం”లో శ్రీ నండూరి రామమోహన రావు వారు చెప్పిన మాటలు చూడండి.
“ప్రతిదీ కామన్ సెన్స్ కు అనుగుణంగా వుండాలన్న వాదం కుదరదు. జీనో వంటి పారభౌతికవాదుల సిద్ధాంతాలు కేవలం తర్కాన్ని ఆధారం చేసుకున్నట్టివి. అవి అసంబద్ధంగా వున్నవని తోస్తే వాటిని తిరిగి తర్కంతోనే పూర్వపక్షం చేయాలి. ఏమైనా చాలా శతాబ్దాల పాటు కొరుకుడు పడని జీనో పేరడాక్సుల పద్మవ్యూహాన్ని ఈ శతాబ్దంలో అభివృద్ధి అయిన నూతన గణితశాస్త్రాన్ని ఉపయోగించి ఛేదించడం సాధ్యమైందని అంటున్నారు.” (విశ్వదర్శనం, ప్రధమ ప్రచురణ పుట.60).
ఈ మాటలే ఈ వ్యాసానికి ప్రేరణ. ఏదియేమైనా, పాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాల్ని తెలుగు ప్రజానీకానికి పరిచయం చేసి, ఆయనే స్వయంగా అన్నట్టు నా వంటి సామాన్యుల మనః కుహరాంతరాలలోనికి సైతం జొచ్చి, మా చేత మరో కొలంబస్ అమెరికా ఖండ యాత్రనూ, మరో చంద్రలోక యాత్రనూ చేయించిన శ్రీ నండూరి రామమోహన రావు వారు ఎనభై సంవత్సరాల వయసుకి దగ్గరగా విజయవాడలో నివసిస్తున్నట్టు తెలియవస్తున్నది(తప్పయితే క్షమించగలరు). వారికీ, వారి సాహిత్య సేవలకూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఆయనకు మరిన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడుని ప్రార్థిస్తూ, ఈ వ్యాసం ముగిస్తున్నాను.
(సమాప్తం)

2 అభిప్రాయాలు:
చాలాకాలం వరకు, గ్రీకు తత్వవేత్తలకీగాని, గణితశాస్త్రజ్ఞులకి కాని infinity అనే మాథమాటికల్ కాన్సెప్టు తెలియదు - అందుకనే, జీనో పారడాక్సులు గొంతుకడ్డం పడుతుండేవి. . కాని, లైబ్నిజ్, న్యూటన్లు కనుగొన్న కాలుక్యులస్ తో జీనో పారడాక్సులు విడిపోయేయి. ఈ పారడాక్సులన్నీ కాలుక్యులస్ లో ప్రాధమిక సూత్రాల సాయంతో విప్పొచ్చు.
First one deals with limits (as delta S tends to infinity, delta t tends to Zero)
Second one deals with acceleration
And finally the third one deals with instantaneous motion (reaction)
మీరిచ్చిన వివరణలు కూడా ఈ సూత్రాలకి చాలా దగ్గరగా వచ్చేవే, కాబట్టి, మీరు చేసిన పూర్వపక్షం రమారమి కరక్టే - వేసుకోండి వీరతాళ్ళు.
మీకు ఇటువంటి విషయాలమీద ఆసక్తి ఉంటే - A tour of the calculus, The man who knew infinity (ramanujam's biography) చదవండి. పెద్దగా గణితశాస్త్రంతో పరిచయంలేనివారికోసం రాసిన పుస్తకాలే ఇవి.
అయ్యా, నాగరాజు గారూ మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు గణితశాస్త్రం తలకెక్కలేదు. అందుకే ఇంటర్, డిగ్రీలలో సైన్సు తీసుకున్నా. మీరు చెప్పినవి నాకు తెలీవు. ప్రస్తుతం అవి దొరికితే చడవడానికి ప్రయత్నిస్తాను. నేను ఈ పేరడాక్సుల్ని పూర్వపక్షం చేయడం అంటే ఏదో నాకు తెలిసిన హేతుబద్ధమైన ఆలోచనతో మాత్రమే. తెలుగు సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన విలన్ ని పల్లెటూరి హీరో నాటు దెబ్బలతో చంపేస్తాడు చూడండి అలాగన్న మాట. ఏదియేమైనా మీ కామెంట్ నాకెంతో స్పూర్తిదాయకం. నేను చేసిన ఆలోచన అంతటికీ నాకు లభించిన గొప్ప పారితోషికం వంటిది. మరోసారి కృతజ్ఞతలతో. . .
Post a Comment