ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, November 14, 2007

స్నానఘట్టం!..1

ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.

స్నానఘట్టం! (కథ)

నేనూ చంద్రంగాడూ ఆ గదిలోకి అద్దెకి దిగిన నెలరోజుల వరకూ గ్రహించలేకపోయాం. . .మా గదికీ, వెనుక వైపు పుష్పాంజలి వాళ్ల పోర్షనులోకి తలుపు క్రిందుగా అవతలివేపుకి చూసేందుకు వీలుగా ఒక ‘సందు’ వుందన్న విషయం. అది గమనించిన రోజున మేం చూసిన దృశ్యాలూ, గడిపిన క్షణాలు మహత్తరమైనవి. శృంగార చరిత్రలోకి మళ్ళించదగినవి.

పుష్పాంజలికి పద్దెనిమిదేళ్ళుంటాయి. ఆమెకి తండ్రి లేడు. తల్లితో పాటే ఆ పోర్షనులో వుంటుంది. ఒకే యింటిలోని నాలుగు గదుల్లో రెండు గదులు వాళ్లకి, రెండు మాకు అద్దెకిచ్చాడు ఆ యింటి యజమాని. ఎవరి వాకిల్లు వాళ్లకేలా వాళ్ళ వాకిలి అటువేపునుంటే మాకు యిటువైపు వుంటుంది. మా లోపలి గదిలో వాళ్ళకీ మాకూ మధ్య అడ్డంగా వున్న తలుపుకి గడియ వాళ్ళ వేపుకే వుంటుంది.

వయసుకొచ్చిన ఆడపిల్ల యింట్లో వుండగా ‘బ్యాచిలర్స్’ మైన మాకు ఆ గదులు అద్దెకివ్వడం గురించి విని పుష్పాంజలి వాళ్ళ అమ్మ మొదట్లో యిష్టపడలేదట. మేం బుద్దిమంతులమైన కుర్రాళ్ళమనీ, పైగా ఒక పేరున్న కంపెనీలో వుద్యోగులం గనుక కాస్త భయమూ, భక్తీ కలిగివుంటామనీ ‘యింటి ఓనరే’ నచ్చజెప్పాక సమాధానపడిందట.

ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో ‘టీచర్’ గా పనిచేస్తుంది. వాళ్ళ ఆర్థిక స్థితి బాగా లేనందువల్ల, పుష్పాంజలి కూడా యింటర్ పూర్తిచేసిన తర్వాత అంతటితో చదువు చాలించి, ఈ మధ్యనే మరో కాన్వెంటులో ‘ట్యూటర్’ గా కుదిరింది. ఇద్దరికీ కలిపి లభించే నాలుగు వేల రూపాయల సంపాదనతోనే యింటి అద్దెతో సహా వాళ్ళకి అన్నీ గడవాలి. అందుకే వాళ్ళింట్లో వస్తువులేం పెద్దగా వుండవు. లేనితనం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.

పుష్పాంజలి పెళ్ళి వాళ్ళ అమ్మకో యుద్ద సమస్య! ఎందుకంటే వాళ్ళకి స్థిరాస్తులు ఏమీ లేవు. . . అప్పడెప్పుడో వాళ్ళ నాన్నగారు బతికుండగా కొనిపెట్టిన ఓ లక్ష రూపాయల విలువ చేసే యింటిస్థలం మినహా. పుష్పాంజలికి యిద్దరు అక్కలు. ఇద్దరికీ పెళ్ళయిపోయింది. అయితే వాళ్ళిద్దరికీ ఉద్యోగస్థుల్ని తీసుకొచ్చి పెళ్ళిచేయలేకపోయానని పుష్పాంజలి వాళ్ళ అమ్మకి ఒక వెలితి వుండిపోయిందట. అందుకే పుష్పాంజలికి మాత్రం చిన్న ఉద్యోగే అయినా, చివరకి ‘అటెండరే’ అయినా సరే ఉద్యోగినే తీసుకొచ్చి పుష్పాంజలికి పెళ్ళి జరిపించాలని వాళ్ళ అమ్మకి కోరికట. అందుకోసం తలా ఓ చెయ్యేసి పుష్పాంజలిని ఓ యింటిదాన్ని చేయమని ఆమె తన అన్నదమ్ముల్ని సహాయం అర్థించిందట. ఇవీ పుష్పాంజలి గురించి ఆ గదిలోకి వచ్చీరాగానే మాకు తెలిసిన విషయాలు.

ఇంటిలోని పేదరికం పుష్పాంజలి శరీరంలో దీపమెట్టి వెదికినా కనిపించదు. కోట్లు కుమ్మరించినా కొనలేని చక్కదనం ఆమెది. స్త్రీ శరీరంలో ఏ అవయవం ఎక్కడ వుండాలో, ఏ వంపు ఎక్కడ తిరగాలో మొత్తంగా తెలుసుకున్న ఏ దేవశిల్పో పనిగట్టుకుని రూపొందించినట్టు సన్నగా, నిండుగా, బంగారు తీవెలాగా వుంటుందామె శరీరం.

కుదిపితే చాలు కదిలిపోయి నాట్యంచేసే పొడవైన వాలుజడ. . .సుప్రభాత కాంతిన కన్పించే ఆకాశంలా విశాలంగావున్న నుదుటిమీద జ్వాలాకారంలో అగ్నిశిఖలా ప్రకాశించే సింధూర బొట్టు. . . మేఘాలఛాయ లాంటి కనురెప్పల మాటున అమృతమే వర్షిస్తున్నట్టు స్వచ్ఛంగా వుండే కళ్ళు. . .గులాబీల్ని గుర్తుకుతెచ్చి పలుచగా పారదర్శకంగా వుండే చెక్కిళ్ళు. . .చక్కగా, స్ఫుటంగా మొత్తం వ్యక్తిత్వానికే తార్కాణంలా అన్పించే పొడవైన ముక్కు. . .గడ్డిపోచ కదిలినా, ధూళికణం చెదిరినా బెదిరి అదిరే ఎరుపురంగు పెదాలు. . .నడిస్తే నడమంత్రంగా కాకుండా కాస్త పొందికగా, క్రమబద్ధంగా వూగే నడుము. . .నిల్చున్నప్పుడు చదునుగా వుండి, కూర్చున్నప్పుడు సన్నగా మడతపడే కడుపు. . .నిష్ఠూరంతో నిక్కబొడుచుకుని, నిండుగా ఎత్తుగా వుండి, “స్త్రీత్వానికి నేనే చిహ్నం” అన్నట్టు గర్విస్తుండే బిగుతైన రొమ్ము ద్వయం!

మొత్తం మీద వర్ణించడానికి వస్తువులు లేని శరీరం పుష్పాంజలిది!

అక్కడ అద్దెకి దిగిన మొదటిరోజునే మాకూ పుష్పాంజలి వాళ్ళకి అడ్డుగా వున్న తలుపుకి రంధ్రాలేమైనా వున్నాయేమోనని ఆ తలుపుని ప్రతి అంగుళం చొప్పున వెదికి వెదికి గాలించాం నేనూ చంద్రంగాడూ. రంధ్రమైతే ఒక్కటీ కన్పించలేదుగానీ, పుష్పాజలి వాళ్ళ అమ్మ ఎంత మర్యాదస్థురాలో, మరెంత జాగ్రత్తపరురాలో, యింకెంత సునిశితమైన దృష్టిగలిగిందో, ఆ విషయం మాత్రం అర్థమైంది మాకు క్షుణ్ణంగా. ఎందుకంటే, తలుపుకున్న రంధ్రాలన్నింటినీ శ్రద్ధగా వెదికి, ఓపిగ్గా కాగితాలంటించుకున్నారు వాళ్లు. ఆ విషయం కాస్త సజావుగా అర్థమయ్యేటప్పటికి మేం వెదుకులాట ప్రయత్నాలన్నీ తాత్కాలికంగా విరమించుకున్నా, క్యూరియాసిటీని మాత్రం చంపుకోలేకపోయాం. దానికో కారణం వుంది.

అదంతా ఒకే యిల్లు గనుక బాత్రూమ్ మా వైపుకే కట్టబడి వుంది. స్నానం కోసం బాత్రూమ్ కి రావాలంటే పుష్పాంజలి వాళ్లు మా పోర్షను వైపుకి రావాలి. నీళ్ళ బకెట్టుతో పాటు, టవలూ, ఇస్త్రీ బట్టలూ అన్నీ మోసుకుని ప్రతిరోజూ అట్లా రావడం కొంత శ్రమతోనూ, సమయంతోనూ కూడిన విషయం గనుక వాళ్ళు స్నానానికి యిటు రాకుండా అక్కడే వంటగదిలో ఏదో ఏర్పాటు చేసుకున్నారు.

ఈ విషయాలన్నీ మేం గ్రహించడం వల్లనే మాకూ వాళ్లకూ అడ్డుగా వున్న తలుపునట్లా అణువణువు పర్యంతం రంధ్రాన్వేషణ చేయడం జరిగింది. మేం చేస్తున్న పని తప్పని మాకూ తెలుసు. కానీ, పుష్పాంజలి వంటి ‘పుడమి పుష్పం’ పది అడుగుల దూరంలో పన్నీటి స్నానాలు చేస్తుంటే పట్టనట్టు కూర్చోవడానికి మేం పసివాళ్ళమూ కాదు. . .ప్రాయముడిగిన వృద్ధులమూ కాదు. ఎవరేమన్నా, ఏమనుకున్నా.
* * *
(సశేషం)

0 అభిప్రాయాలు: