ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Friday, November 16, 2007

స్నానఘట్టం!..3

ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.

స్నానఘట్టం! (కథ)

పుష్పాంజలి నగ్నదేహాన్ని చంద్రం చూడటం నాకు బాధని కలిగించింది. భయం కూడా వేసింది. ఎందుకంటే సౌందర్యపు మహాత్మ్యాన్ని గుర్తించి, దాన్ని నిగూఢంగా తనలోనే ప్రక్షిప్త పరుచుకోగల శక్తీ, సంస్కారం వాడిలో వున్నాయో, లేవో నాకు తెలీదు.

మరో అరనిముషం తర్వాత వాడు పైకి లేచాడు. విభ్రమం చెందినట్టు వాడి ముఖం తెలుస్తూనే వుంది. వాక్కాయ కర్మలన్నీ నశించినట్టు మాటా పలుకూ లేకుండా లేచివెళ్ళి మంచం మీద కూర్చున్నాడు.

“చంద్రం!” అన్నాను నేను వెళ్ళి వాడికెదురుగా ఛైర్లో కూర్చుంటూ.

క్షణం తర్వాత వాడు స్వప్నంలోంచి మాట్లాడుతున్న వాడిలా, “గురూ. ఏంటి గురూ యిది. ఎలా కనిపెట్టేవ్ అక్కడ్నుంచి కనిపిస్తుందని?” అన్నాడు.

“ఏదో అనుకోకుండా చాశాలే.” అన్నా.

“ఏమైనా నీకు హాట్సాఫ్ గురూ!” అని, “గురూ నాకో హెల్ప్ చేస్తావా?” అన్నాడు మళ్ళీ వాడే.

“ఏమిటి చెప్పు”

“నాకు ఇమ్మిడియట్ గా పెళ్ళి చేసెయ్ మని మా నాన్నగారికో ఉత్తరం రాసెయ్ గురూ.” అన్నాడు.

నాకు నవ్వొచ్చింది. “ఎవరితో. . .పుష్పాంజలితోనా?” అన్నాను.

“అయ్ బాబోయ్!” అదిరిపడ్డట్టుగా అని, “ఎవరోవొకరు. . .స్నానం చేసేప్పుడు నువ్వు చూడని పిల్ల.” అన్నాడు.

“సర్లేగానీ ఈ విషయం ఎవరితో అనకు. పుష్పాంజలి పెళ్ళిగాని పిల్ల.” అన్నాను.

“అయ్ బాబోయ్ యిదెక్కడి కండిషన్ గురూ? నువ్వేమన్నా అనుకో ఈ సంగతి శీనుగాడికి చెప్పి, ఈ బాత్రూం సీను వాడికి చూపించందే నాకు నిద్రపట్టదు.” అన్నాడు వెంటనే

నేను గతుక్కుమన్నాను. “అట్లా చేయడం తప్పు కదా చంద్రం” అన్నాను.

“తప్పోఒప్పో నాకు తెలీదుగానీ నువ్వుమాత్రం పోస్టాఫీసుకెళ్ళి నేను చెప్పిన పనిమీదుండు.” హాస్యధోరణిలో అంటూ అక్కడే వున్న బకెట్ అందుకున్నాడు.

“జోకులు తర్వాత గానీ చంద్రం దయచేసి ఈ విషయం ఎవరికీ. . .” నేనింకా మాట పూర్తిచేయకముందే. . .

“అల్పుడ్ని గురూ. నిగ్రహం లేనివాడ్ని. నన్నొదిలెయ్. . .ముందు బాత్రూమ్ కెళ్ళనీ.” అంటూ బాత్రూంవైపు పరుగులు తీశాడు.

* * *

ఆరోజు నుండీ పుష్పాంజలిని అలా చూడటం మాకు అలవాటైపోయింది. రోజూ ఏ ఎనిమిది తొమ్మిది గంటలకోగానీ నిద్రలేవని చంద్రంగాడు ఆ మరుసటిరోజు నుండీ అయిదు గంటలకే లేచి తలుపు దగ్గర మాటువేయడం ప్రారంభించాడు. ఆ రెండోరోజు సాయంత్రం వాడి ఫ్రెండు శీనుగాడ్ని వెంటబెట్టుకొచ్చి, ఆ రాత్రి మా గదిలోనే నిద్రజేయించి వుదయాన్నే పుష్పాంజలి స్నానకార్యక్రమం చూపించి, ఆమె అందచందాల మీద చర్చలు జరిపి, వాడిని హోటల్ కి తీసుకెళ్ళి టిఫిన్ తినిపించి మరీ పంపాడు. అక్కడ నాది ప్రేక్షక పాత్రే అయింది. ఏం చేయను శీనుగాడితో వాడి స్నేహం అంత ప్రగాఢమయింది మరి.

ఆ తర్వాత పదిరోజులు గడిచేసరికల్లా ఒక్క శీనుగాడేం ఖర్మ. . .ప్రసాదు, రంగనాయకులు, ఇమ్మాన్యుయేలు, వెంకటేశ్వరరావు, లింగంబాబు, అల్లాబక్షు, ప్రకాశం అందరూ మా యింట్లో విడిదిచేసి వెళ్ళడం జరిగింది. పైగా మా ఆఫీసులో యిదో ‘బర్నింగ్ టాపిక్’ అయిపోయింది. ఎవరినోట విన్నా పుష్పాంజలి నగ్నదేహ సౌందర్య వర్ణణే. ఎవరు చూసినా మా అదృష్టానికి అసూయపడేవాళ్ళే. నాకిది అత్యంత బాధాకరంగా పరిణమించింది.

మా రూమ్ కి వచ్చేపోయే వాళ్ళదాడి చూసి నాకు భయం వేసేది. ఎందుకంటే మాది ఐదొందల మంది వుద్యోగులున్న ఆఫీసు. ఈ విషయం మాయింటి ఓనరుగ్గానీ, ఆ వీధిలో వాళ్ళకిగానీ తెలిస్తే మా గతేంటో నాకు తెలుసు. ఆడపిల్ల బ్రతుకు బజార్లో పెట్టినందుకు కుక్కని కొట్టినట్టు తరిమి, తరిమి కొట్టడం జరుగుతుంది. అదేగాక ఈ విషయం పుష్ఫాంజలికి తెలిస్తే ఏమౌంతుందో ఆమె ఎలా ప్రతిస్పదింస్తుందో. . .గుట్టుగా జీవితం గడుపుకునే మర్యాదస్థుల పిల్ల. ఏ అఘాయిత్యమో చేసుకుని చనిపోతే?

ఈ విషయాలన్నీ నేను చంద్రంగాడితో వివరంగా చెప్పి, ఈ జనాల ప్రభంజనం ఆపాలని ప్రయత్నించాను. వాడు నా మాటలన్నీ ఒక్కమాటతో తీసేసి, “ఉండు గురూ! నీది మరీ చాదస్తం మన ఆఫీసెక్కడ. రూమెక్కడ? పదిహేను కిలోమీటర్ల దూరముంది. ఎవరికీ తెలిసే అవకాశమే లేదు.” అంటూ నాలుక చప్పరించేశాడు.

పుష్ఫాంజలి వాళ్ళింటికి ఎవరైనా బంధువులొస్తే చంద్రంగాడికి ఆరోజు మహాపండుగ. ఎందుకంటే ఆ బంధువుల్లో కొందరు ఆడవాళ్ళంటూ వుంటారు. ఆడవాళ్ళంటూ వుంటే వాళ్ళు స్నానాలంటూ చేస్తారు. స్నానాలంటూ చేయడం జరిగితే వీడు చూడడమంటూ జరిగి తీరుతుంది. రుచులు, రకరకాల రుచులు, విభిన్న రకాల రుచులు! వాడి ఆనందానికి అంతుండేది కాదు.

నేను ‘చంద్రంగాడ్ని వదిలేసి వేరే రూమ్ వెదుక్కుందామా వద్దా’ అనే డైలమాలో వుండగానే, ఒకరోజు పుష్ఫాంజలి అక్కలు యిద్దరు వూర్నుండి వచ్చారు. ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళే. వాళ్ళు వచ్చినరోజున చంద్రం, ఉమేష్ గాడ్ని వెంటబెట్టుకు వచ్చాడు. ఉమేష్ గాడు రావడం. . . రావడం బైనాక్యులర్స్ మెడలో వేసుకుని మరీ వచ్చాడు.

రెండు గంటల నిరీక్షణ అనంతరం వంటగదిలో నీళ్ళ చప్పుడు విన్పించింది. శబ్ధ వినీ వినక ముందే ఉమేష్ గాడు ఆత్రంగా నేలమీదకిబడి, చకాలున బైనాక్యులర్స్ తో చూసేసి, ఒక్క క్షణంలో అంతే వేగంగా పైకి లేచాడు. ఆపైన “ఆడవాళ్ళని చూపిస్తానని తీసుకొచ్చి మగాళ్ళని చూపిస్తావా?” అంటూ, కోపంతో చంద్రం మీద విరుచుకు పడ్డాడు. తీరా చంద్రంగాడు పరిశీలించి చూసేసరికి అవతల స్నానం చేస్తున్నది పుష్ఫాంజలి వాళ్ళ బావ అని తేలింది. ఎలాగో వాడు ఉమేష్ కి నచ్చజెప్పుకున్నాడు. ఆపైన యింకో రెండు గంటలు వెయిట్ చేసి, ఎంతకీ పుష్ఫాంజలి స్నానం చేయకపోవడంతో, “మట్టి మొహంది. . .మట్టిముండ. . .స్నానం చేయదు. . .పాడూ చేయదు. . .ఆరోగ్యం ఏమైపోవాలి?” అని తిట్టుకుంటూ, “నేను ఈ రోజు కూడా మీ యింట్లోనే వుండి రేపు ఉదయం వెళతాన”న్నాడు ఉమేష్. నేను “కుదరదంటే కుదరద”న్నాను. చేసేదేంలేక వాడు పుష్ఫాంజలితో పాటు నన్నూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పుష్ఫాంజలి ఆరోజు సాయంత్రంవేళ స్నానం చేసింది.

మరోరోజు అప్పారావొచ్చాడు. అంతా చూసి, “ఆహా క్యా సీన్ హై!” అన్నాడు ఆనందపారవశ్యంతో.

వాడి ఆనందం చూసి, “ఇంతకీ పుష్పాంజలి అందగత్తేనంటావా?” అన్నాడు చంద్రం.

“నాకేం తెలుసు?” అన్నాడు అప్పారావు ఆశ్చర్యంగా.

“ఇప్పటిదాకా నువ్వు చూసిందేమటి?” అన్నాడు చంద్రం.

“నేను మొహం ఎందుకు చూస్తాన్రా భాయ్. మొహం చూడ్డానికొచ్చినానా యింత దూరం?” అన్నాడు అప్పారావు అమాయకంగా.

చివరకి అట్లా తయారయింది మా రూమ్ పరిస్థితి. నేను చేసేదేమీలేక జరిగేదేదో జరక్కపోదని భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించసాగాను.

* * *
(సశేషం)

1 అభిప్రాయాలు:

Anonymous said...

Khtha Rasavatharamga vundi. Mukyamga PUSPANJALI VARNANA.