శ్రీరామమూర్తీ - సిరచ్ఛేదం...3
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)
“ఏమౌద్దిలే శ్రీరామ్మూర్తీ. దాని ఖర్మానికది చచ్చింది. అన్నా. తేలికగా తీసిపడేసినట్టు నటిస్తూ.” నా ప్రక్కన భాస్కర్ వచ్చేనవ్వును బిగబట్టుకుంటున్నప్పటికీ అతడికీ నేను చెప్పబోయేదేమిటో వినాలనే వుంది.
“సార్! మీరేదో నామీద మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. నిజంగా మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” శ్రీరామమూర్తి మాటల్లో కంగారు కంటే భయమే ఎక్కువగా కన్పిస్తోంది.
“నువ్వు భలే వోడివే శ్రీరామ్మూర్తీ మనసులో పెట్టుకోడానికి నువ్వేమయినా నా శత్రువా? అయినా అందులో నువ్వు చేసిన తప్పేం వుంది. నిద్రమత్తులో చూసుకోకుండా తొక్కావు. కావాలని. . వాంటెడ్ గా దాన్ని మర్డర్ చేయలేదు గదా.” అన్నా.
“లేదు సార్ మీరు నన్ను ఏడిపిస్తున్నారు. దయచేసి మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” అన్నాడు శ్రీరామమూర్తి.
“ఏమనడు.” శ్రీరామ్మూర్తీ.
“లేదు దయచేసి చెప్పండి సార్. మంత్రిగారికి బాగా కోపమొస్తుంది గదా?” శ్రీరామమూర్తి గొంతులో ఆత్రుత కన్పిస్తోంది.
“కోపమెందుకు శ్రీరామ్మూర్తీ నువ్వేమయినా కుక్కపిల్లని కావాలని చంపావా?” అన్నా.
“లేదు లెండి. చెప్పండి సార్ విజయకుమార్ గారూ. నేనిక్కడ భయపడి ఛస్తున్నా.” అన్నాడు శ్రీరామమూర్తి.
“సరే శ్రీరామ్మూర్తీ భయపడుతున్నావు గాబట్టి నిజం చెప్తున్నా.” అన్నా.
“చెప్పండి.” శ్రీరామమూర్తి వినడానికి ముందుకి జరిగేడు.
“నిజం చెప్తా. భయపడకూడదు.” అన్నా మళ్ళీ.
“అబ్బ చెప్పండి సార్ అయ్యగారూ తొందరగా.”
“మంత్రిగారు ఏమీ అనరు గానీ. . .” సగంలో ఆపా.
“ఏమీ అనకుండా. . .” ఏమీ అనడనేప్పటికి శ్రీరామమూర్తి కొద్దిగా సంబరపడుతూనే క్యూరియాసిటీగా అడిగాడు.
“ఏమీ అనరుగానీ . . .ఈ విషయం వినగానే నిన్నలా తన దగ్గరకి రమ్మంటారు.”
“దగ్గరగా వచ్చాక?” శ్రీరామమూర్తి అమాయకంగా అడిగేడు.
“దగ్గరకి వచ్చాక ఒకసారి నిన్నలా నేల మీద పడుకోమంటారు.”
“పడుకుంటే?” శ్రీరామమూర్తి నా ముఖం వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు.
“పడుకుంటే యింకేముంది. నువ్వు కుక్కపిల్ల గొంతుమీద కాలేసినట్టే మంత్రిగారు నీ గొంతుమీద కాలేసి అలా నులిమేస్తారు. సిగరెట్ పీకని నులిమినట్టు.” అన్నా.
ఇక భాస్కర్ నవ్వుని బిగబట్టుకోలేక పక పక మని విరగబడి నవ్వేశాడు.
శ్రీరామమూర్తి కి మండింది.
“మీరు భలేవోరండీ చచ్చేవాడ్ని యింకా చంపుతారు.” అలిగినట్టుగా అంటూ, భాస్కర్ వైపు తిరిగి “చూడండి సార్ భాస్కర్ గారూ ఈయన వేళాకోళం.” అన్నాడు.
“అయితే నువ్వు అడగడం ఎలాగుంది శ్రీరామ్మూర్తీ!: అన్నా నేను సీరియస్ లోకి వస్తూ.
“ఏమడిగానండీ మంత్రిగారేమంటారు అన్నా.” అన్నాడు శ్రీరామమూర్తి.
“మంత్రి గారేమంటారో. నువ్వు చెప్పే టైమ్ కి ఆయన ఏ మూడ్ లో వుంటారో. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో నాకు గానీ ఈ భాస్కర్ కి గానీ తెలుసా?” అన్నా.
“మరి తెలీక పోతే తెలీదనొచ్చుగదండీ. నన్నిలా హడలగొట్టడమెందుకు?” అన్నాడు శ్రీరామమూర్తి.
“మరి నువ్వు ఏమంటారు. . ఏమంటారు అంటూ వత్తొత్తి అడిగితే నన్నేం చేయమంటావు.” అన్నా.
“సర్లేండి నా ఖర్మెలాగుంటే అలా కాలుద్ది.” అన్నాడు శ్రీరామమూర్తి.
“నీ ఖర్మేం కాలదులే శ్రీరామ్మూర్తీ మేమంతా లేమా. మంత్రిగారు రానీ పి.యస్ గారి చేత చెప్పిద్దాం పొరపాటైందని. పి.యస్. చెపితే ఏమనరు.” అన్నా ధైర్యం చెపుతూ.
“అమ్మయ్య ఆ పని చేయండి సార్. చచ్చి మీ కడుపున పుడతా.” అన్నాడు శ్రీరామమూర్తి.
“వారం రోజుల్లో వస్తారు మంత్రిగారు నీకు శిరచ్ఛేదం జరగకుండా చూసే బాద్యత మాది.” అన్నా భాస్కర్ ని నాతో కలుపుకుంటూ.
“అమ్మో ఈ వారం రోజులిట్టా నేను భయపడుతూనే వుండాలా?” అన్నాడు శ్రీరామమూర్తి.
“భయపడాల్సిన అవసరం లేదంటున్నాగా. కుక్కుపిల్ల ఛస్తే మనల్ని ఉరేసేస్తారా శ్రీరామ్మూర్తీ నీ పిచ్చిగాకపోతే.” అన్నా.
“నిజంగానండీ సార్ విజయకుమార్ గారూ చాలా భయపడిపోయానండి.” అన్నాడు శ్రీరామమూర్తి.
“అంత అవసరం లేదుగానీ. బంగ్లాకెళ్ళి పని చూస్కో. నీకేంగాదు.” అన్నా.
“చాలా థాంక్సండీ!” అంటూ శ్రీరామమూర్తి వెళ్ళిపోయాడు.
ఏదో పైకి కాస్త ధైర్యంగా కన్పిస్తున్నాడుగానీ నిజానికి శ్రీరామమూర్తి ఆ వారం రోజులూ సరిగా నిద్రపోయాడంటే నేను నమ్మను.
వారం రోజులు గడిచాయి. ఆ రోజు మంత్రిగారు హైదరాబాదు రావాల్సిన రోజు. కానీ రాలేదు. ఎందుకనో ‘టూర్’ రెండు రోజులు వెనక్కి ‘పోస్ట్ ఫోన్’ అయింది.
మంత్రిగారి రాక కోసం క్షణమొక యుగంగా ఎదురుచూసిన శ్రీరామమూర్తి మళ్ళీ రెండు రోజులనేసరికి డీలా పడిపోయాడు.
“ఇంకా రెండు రోజులు నేను భయపడుతూ బతకాలా?” అన్నాడు.
“మరి నేను భయపడుతూ బతకాలా?” అన్నా.
“లేదు లేదు.” బలవంతంగా తలూపేడు శ్రీరామమూర్తి నా మీద అక్కసుతో.
రెండ్రోజలూ గడిచాయి. ఇక ఈ రోజు వచ్చేస్తాడు మంత్రి అనుకుంటుండగానే మరో రెండు రోజులు వెనక్కి జరిగినట్టు ఫోనొచ్చింది.
ఇక శ్రీరామమూర్తికి సహనం చచ్చిపోయింది. నాతో మాటైనా చెప్పకుండా రాత్రికి రాత్రే రైలెక్కి కాకినాడ వెళ్ళిపోయాడు. మంత్రిగారిని కలిశాడు.
శ్రీరామమూర్తిని చూడగానే “ఏంరా యిట్లా వచ్చావు?” అన్నాట్ట మంత్రి ఆశ్చర్యంగా.
“ఏం లేదయ్యా నిద్రమత్తులో చూసుకోకుండా కుక్కపిల్లని తొక్కేశాను. చచ్చిపోయింది. అది చెప్పడానికే వచ్చాను”. అన్నాట్ట శ్రీరామమూర్తి.
“ఛస్తే చచ్చిందిలే. అది చెప్పడానికి యింత దూరం రావాలా నువ్వు ఛార్జీలు పెట్టుకుని? అన్నాట్ట మంత్రిగారు.
“భయమేసిందండీ అయ్యగారూ.” అన్నాట్ట శ్రీరామమూర్తి.
“ఛీ ఫో పిరికి సన్నాసీ!” అంటూ ఓ అయిదొందలు తీసి శ్రీరామమూర్తికిచ్చాట్ట మంత్రిగారు ఛార్జీల నిమిత్తం.
“అమ్మయ్య అయ్యగారు మంచోరే. శిరచ్ఛేదం చేయలేదు. పైగా అయిదొందలిచ్చారు.” అనుకుని ఊపిరి తీసుకున్నాట్ట శ్రీరామమూర్తి తొమ్మిది రోజుల తర్వాత ఫ్రీగా.
అదీ కథ!
( సమాప్తం )

10 అభిప్రాయాలు:
చాలా బాగుందండీ, తెగ నవ్వుకున్నాను ఈ మూడు భాగాలూ చదివి. పాపం ఆ మంత్రిగారు కూడా మంచివాడేనన్నమాట.
నాగమురళి గారూ,
ఏదో సరదాగా రాసానండీ. అదేంటో ఖర్మ ఈ టపా మొదలెట్టినప్పట్నుండీ నాకు పనులే. అసలు పూర్తిగా కంప్యూటర్ కి దూరంగా కూడా కొన్ని రోజులు వుండాల్సొచ్చింది. బహుశా శ్రీరామమూర్తి ఉసురు పోసుకున్నానేమో మరి.
వారానికి ఒక్కసారన్నా కనీసం ఇలాంటి టపా ఒక్కటి చదివితె డాక్టరుకు దూరంగా ఉండొచ్చు అని నాకు చివరాఖరివరకూ ఎదురు చూసి చదివాక అనిపించింది.ధన్యవాదాలు విజయకుమార్ గారు.
రాజేంద్రగారూ కృతజ్ఞతలు. మీరన్నది నిజమే గానీ జీవితమన్నప్పుడు అంతా సరదానే కాదు గదా. సీరియస్సూ వుండాలి, విజ్ఞాన సంబంధం గానూ వుండాలి. శృంగారమూ వుండాలి. అన్నీ వుండాలి. అన్ని రసాలూ కలిస్తేనే కదా బ్లాగుకైనా బ్రతుకైనా ఒక పరిపూర్ణత ఒక సార్థకత ఏమంటారు? పేరెందుకు గానీ ఒకాయనకి ఈ మధ్య ఆయని టపా మెచ్చుకుంటూ ఓ వ్యాఖ్య రాసా. ఆయన నాకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం యిచ్చాడు. ఇంచుమించు ఆయనకి వ్యాఖ్యలు రాసిన వాళ్ళందరికీ ఏదో ఒక మాటతో బాధ పెట్టేడు. నాకైతే కుక్క జోలికి బోయి చక్కదనం వెక్కిరింపజేసుకున్నట్టయింది. ఇందంకా ఎందుకు చెపుతున్నానంటే నేను మీకు ఇక్కడ చెప్పిన సమాధానం అటువంటిది కాదనీ, జీవితం పైన సమగ్రమైన జిజ్ఞాసను కలిగివుండాలని చెప్పడమే నా ఉద్దేశ్యంమనీ యిందుమూలంగా విన్నవించుకుంటున్నాను.
:))) ఇంతకీ అమ్మగారేమన్నారో.
సత్యసాయి గారూ,
అయ్యగారి ఆశీర్వాదం తీసుకున్నాక యిక అమ్మగారి ఎఫెక్టు పెద్దగా వుండి వుంటుందనుకోను. టపా రాసాక మీకు కలిగిన సందేహమే నాకూ కలిగింది. నిజానికి నాకా విషయం గుర్తులేదు. కృతజ్ఞతలతో. . .
నిజంగా జరుగుతుందో లేదో తెలియని ఒక ప్రమాదం గురించి అంతలా వర్రీ అవకూదని శ్రీరామ్మూర్తి పాత్ర చెబుతుంది.
ఏదైన అవాంతరాన్ని ఊహిస్తున్నప్పుడు మనలో చాలా మంది శ్రీరామ్మూర్తి లానే ప్రవర్తిస్తాం. ఎవర్నో ఒకళ్ళని సలహాలు అడుగుతూంటాం. తీసుకుకున్న నివారణా చర్యలని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం. అయినా భయం పోదు. దాని కన్నా సమస్యని ఎదుర్కోదమే సరైనది.
మొదటి రెండు భాగాలు హాస్యంగా సాగినా, ముగింపు బావుంది.
సోమ శంకర్ గారూ,
నిజమే మీరన్నట్టు మనం ఏదో చాలా ఎదిగిపోయాం అనుకుంటాం కానీ చాలా చిన్న విషయాలకి సైతం బెంబేతెత్తిపోతుంటాం. ఇక్కడ శ్రీరామమూర్తి మనకి దొరికిన దొంగ లాంటి వాడు. మనం అతడి కంటే ఏ మాత్రం వేరు కాదు. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి అంతకంటే దారుణంగా కూడా ప్రవర్తిస్తుంటాం. కృతజ్ఞతలతో
వింజమూరన్నా! నీ రచనల్లో నాకు మొదటిసారి నచ్చింది ఈ కథ.-- నీ నియాండెర్తల్ మిత్రున్ని.
ఓ అనోనిమస్ తమ్ముడూ,
ఏదో ఆరోజు విసుగులో వుండి అలా 'నియాండర్తల్' అని తిట్టా. క్షంతవ్యుడిని. నా రచన 'శ్రీరామమూర్తీ-సిరచ్ఛేదం' అనేది నా జీవితంలో 1993 లో నిజంగా జరిగిన ఒక అనుభవం. అది కథ కాదు. అయినా నా కథలంత పేలవంగా, బలహీనంగా వుండవు. ఈ విషయం మాత్రం నేను గర్వంగానే చెప్పకుంటాను. ఎందుకంటే మూమూలు కథలకు బహుమతులు రావుగదా. అయినా శ్రీరామమూర్తి ఉదంతం మీకు నచ్చినందుకూ, నాకు వ్యాఖ్య ద్వారా మీ అభిప్రాయం తెలిపినందుకూ మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
Post a Comment