శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)
ఆ రోజులు. అవి 1993 నాటి రోజులు. నా జీవితంలో అవి తిరిగిరాని రోజులు. పెళ్ళిగానప్పటి మధురమైన రోజులు. పెళ్ళాం గోల్డు కొనమని గోలెట్టని రోజులు. కుమారుడు కారు కావాలని కారుకూతలు కూయని రోజులు. ఉదయాన్నే ఆరు గంటలకు లేచి, రాత్రి పదిన్నర దాకా అడ్డమైన పన్లూ చేయాల్సిన అవసరం లేని రోజులు. మందు కొట్టకుండానే మాంచి నిద్రగొట్టే రోజులు. ‘బ్యాచిలర్’ గా వుంటూ నా రూమ్ కి నేనే మహరాజునై, ‘సర్వసత్తాక సార్వభౌమత్వా’న్ని కలిగివున్న రోజులు. కొత్తగా వుద్యోగం వచ్చి, ఊర్నుంచి ‘ఎర్ర బస్సు’లో హైదరాబాదొచ్చి, వెర్రిముఖం వేసుకుని వీధుల్ని ఎగాదిగా పరిశీలించే రోజులు. ఉద్యోగం రావడం మూలంగా నేనేదో “సముద్రాల్ని పుక్కిలించ గలన"నీ, "కొండల్ని త్రవ్విపోయగలన”నీ ఊహల్లో, భ్రమల్లో బతుకుతున్న రోజులు. నా మొత్తం జీవితంలో అత్యంత స్వాతంత్రకరమైన బంగారు వజ్రాల రోజులు. (ఈ వాక్యాలు ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమాలో “అమ్మా నాకు నువ్వు జన్మనిచ్చావు. తినడానికి అన్నం యిచ్చావు. అయినా ఎందుకింత ఎర్లీగా చచ్చావు” అంటూ ‘ప్రకాష్ రాజ్’ కవిత చదివినట్టు మీకు అన్పిస్తే అది నా తప్పు కాదు).
ఆ రోజల్లో నేనో మంత్రిగారి (పేరెందుకు లెండి) దగ్గర పనిచేసే భాగ్యమో, దౌర్భాగ్యమో నాకు కలిగింది. మంత్రిగారి పేషీలో పీయే, పీయస్ లతో పాటు నేనూ మరో స్టెనోగ్రాఫరూ, నలుగురు గన్ మెన్లూ, ముగ్గురు డ్రైవర్లూ చివరాఖరికి ఏడెనిమిది మంది అటెండర్లూ వుండేవాళ్ళం. వాళ్ళలో యాభైయేళ్ళ శ్రీరామమూర్తి అనే ఓ తూ.గో. జిల్లా అటెండరు కూడా వుండేవాడు. అతడు పూర్తిగా “ఆయ్ అయ్గారండీ!” అంటూ పూర్తిగా తూ.గో. జిల్లా యాసలోనే మాట్లాడేవాడు. బీపీ లాంటివేం లేవుగానీ వట్టి కంగారు మనిషి. భయమెక్కువ.
ఓ రోజు మంత్రి గారు ఓ ఐదు వేలెట్టి అదేదో మాంచి జాతి కుక్కపిల్లని కొన్నారు. కొంటే కొన్నారు గానీ, పనోళ్ళనీ, అటెండర్లనీ పిలిచి “దాన్ని పసిపిల్లలా జాగ్రత్తగా కాపాడాలనీ, పెంచాల”నీ హుకుం జారీ చేశారు. “దానికేదైనా అయితే వూరుకోన”నీ హెచ్చరించారు కూడా. ఇక చూడండి. ఆ కుక్కపిల్లకి పాలూ, బిస్కెట్లూ. . ఒకటేమిటి రోజూ రాజ భోగమే. ఇదంతా మంత్రిగారి యింట్లో అంటే మంత్రిగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్సులో నన్నమాట. మేం పని చేసేది సెక్రటేరియట్లో. శ్రీరామమూర్తి మంత్రిగారి యింట్లో పని చేసేవాడు.
ఓ రోజు శ్రీరామమూర్తి సెక్రటేరియట్లోని ఆఫీసు కొచ్చేడు. నేరుగా నా సీటు దగ్గరకి వచ్చి, “సార్ ఓ సమస్య వచ్చిందండి.” అన్నాడు.
“ఏంటది?” అన్నా.
“మంత్రిగారి కుక్కపిల్లకి నేను స్నానం చేయించాలంటారేంటండీ అమ్మగారు?” అన్నాడు (అమ్మగారంటే మంత్రిగారి సతీమణి అన్నమాట).
“మరి చేయించాలి గదా?” అన్నా.
“మీరు భలే వోరండీ. నాకేం ఖర్మ. నేనసలే బ్రామ్మడ్ని. ఇంట్లో నా పిల్లలకి కూడా ఏనాడూ స్నానం చేయించి ఎరగను” అన్నాడు.
“అది నీ సొంత విషయం శ్రీరామ్మూర్తీ. మీ యింటికి నువ్వే రారాజు గాబట్టి అది నీ యిష్టం. కానీ, ఇది నీ డ్యూటీ.” అన్నా ఓ పక్క నవ్వాపుకుంటూనే. అప్పటికే నా పక్కన స్టెనోగ్రాఫర్ భాస్కర్ అటువైపు తిరిగి నవ్వుతున్నాడు.
శ్రీరామమూర్తికి మండింది. “ఏదండి నా డ్యూటీ. కుక్కకి స్నానం చేయించడమా? మీరు భలే వోరండీ. నేను అడక్క అడక్క మిమ్మల్ని సలహా అడిగా” అన్నాడు.
“మరి రాముగాడి చేత చేయించు” అన్నా (రాముగాడు మరో అటెండరన్నమాట)
“వాడు డ్యూటీలో వున్నప్పుడు వాడు చేయిస్తూనే వున్నాడండీ. నా డ్యూటీలోనే నాకీ యిబ్బంది” అన్నాడు.
“మరా విషయం మేడమ్ గారికి చెప్పు” అన్నా.
“ఏ విషయమండీ?” అన్నాడు శ్రీరామమూర్తి అమాయకంగా.
“అదే నువ్వు బ్రాహ్మణుడవనీ. చేయించలేక పోతున్నాననీ”
“నిజంమండీ బాబూ. మొన్న మూడ్రోజులు చేయించా. వాంతొచ్చేస్తుందండీ బాబూ” వికారంగా మొహం పెట్టేడు.
“అదే. ఆ మాటే మేడమ్ తో చెప్పు” అన్నా.
“అమ్మగారు ఒప్పుకుంటారంటారా?” అడిగాడు అనుమానంగా.
“ఏమో నీ బాధ నువ్వు చెప్పాకోవాలి గదా. తర్వాత ఆమె యిష్టం. నువ్వన్నట్టు నీకేం ఖర్మ కుక్కలకి స్నానం చేయించడానికి. అయినా నీకు భయంలాగుంది మేడమ్ తో చెప్పడానికి” అన్నా అతడిని గమనిస్తూ. మా భాస్కర్ నవ్వుకుంటూనే వున్నాడు.
"అలాంటిదేం లేదండీ. ఎంతొకవేళ చప్రాసీగాడినైనా కుక్కలకి స్నానం చేయించడం ఏంటండీ? చెప్పేస్తా అమ్మగారితో” అన్నాడు.
“సరేలే. మెల్లగా చెప్పు. మళ్ళీ తేడా రాకుండా”
“తేడా వస్తే ఏటౌద్దేటండీ. నా పేరెంట్ డిపార్ట్ మెంటు కెళ్తా. పని చేసుకుంటా. అంతే. నా ఉద్యోగమయితే పీకలేరుగదా ఎవరూ” అన్నాడు శ్రీరామమూర్తి.
“ఆ మాత్రం ధైర్యముంటే ఫర్లే శ్రీరామ్మూర్తీ” అన్నా.
“చూడండి రేపు అమ్మగారితో చెప్పి, ఈ సంగతి అటో యిటో తేల్చేస్తా” అన్నాడు శ్రీరామమూర్తి మంత్రి బంగళా కెళ్లడానికి సమాయత్తమవుతూ.
“మేడమ్ గారితో చెప్పింతర్వాత ఆమేం అన్నారో ఓ సారి నాకు ఫోన్ చెయ్ శ్రీరామ్మూర్తీ” అన్నాను.
“అలాగే సార్” అంటూ ఆరోజు శ్రీరామమూర్తి వెళ్ళిపోయాడు.
మర్నాడు ఉదయాన్నే నాకు ఫోన్ వచ్చింది మినిష్టరు గారి బంగ్లా నుండి. ఫోన్లో శ్రీరామమూర్తి.
“విజయకుమార్ గారాండీ” అన్నాడు శ్రీరామమూర్తి నేను ఫోనెత్తగానే.
“అవును. ఏంటి శ్రీరామ్మూర్తీ” అన్నాను గొంతు గుర్తుపట్టి.
“సార్ మీరు చెప్పినట్టే చెప్పాను సార్ అమ్మగారితో. నేను కుక్కపిల్లకి స్నానం చేయించలేనని” అన్నాడు.
“ఏమన్నారు?”
“అయితే నన్ను చేయించమంటావా కుక్కకి స్నానం?” అన్నారండి.
“ఇంకా ఏమన్నారు?” కుతూహలంగా అడిగా.
“నీకు వాంతులొస్తే మరి నాకు రావా వాంతులు?” అన్నారండి.
“అదీ నిజమే గదా” అన్నా. వచ్చే నవ్వును ఆపుకుంటూ.
“మీరు భలేవోరండీ. కాసేపు యిటు మాట్లాడ్తారు. కాసేపు అటేపు మాట్లాడ్తారు” అన్నాడు శ్రీరామమూర్తి.
“మరేం చేయమంటావు శ్రీరామ్మూర్తీ. ఎటో ఒకవైపు మాట్లాడాలి గదా” అని, మళ్ళీ “మరి నువ్వనేదేంటి కుక్కకి నన్ను చేయించమంటావా స్నానం?” అన్నా.
“అయ్యో. రామ రామ. అదేంమాట సార్. అంత మాటనేశారు?” అన్నాడు శ్రీరామమూర్తి తెగ బాధపడిపోతూ.
(సశేషం)

10 అభిప్రాయాలు:
అయ్యా- ఖతర్నాక్ లా ఉన్నారే? బలేఏడిపించారు శ్రీరామ్మూర్తిని. ఇంకా నయం- మంత్రిగారి పెళ్ళాం -అదేదో సినిమాలో ఒక ఆఫీసర్ లా - కుక్కను నాకుము (సాకుము అనేబదులు) అనలేదు. :))
Very interesting. :)
బాగుందండీ....మరి మిగిలిన భాగం ఎప్పుడువదులుతున్నారు?
baavuMdi. taravati bhaagaM kOsam eduru cUstunnaa.
హమ్మయ్యా! మొదటిసారిగా మీరు రాసిన టపా మొత్తం చదివానండి. కాస్త దయ తలచి నాలాంటి సామాన్యులకోసం ఈజీగా అర్ధమయ్యేలా కథలు రాయండి విజయ్ కుమార్ గారు. బావుంది..
Super Sir, Kindly right this kind of Articles besides writing serious articles. I have read your Stories & Earlier, which is literary and scientific value. Both are well. I am really appreciating you Sir,
@సత్యసాయి గారికి,
కృతజ్ఞతలు. అప్పుడే ఏమంయింది సార్. రెండోభాగం చదవండి.
@రానారె గారూ,
కృతజ్ఞతలు సార్.
@వరప్రసాద్ మరియు కొల్లూరి సోమశంకర్ గార్లకు,
సారీ పనుల వత్తిడి వల్ల లేటవుతూంది. ఓ రెండుమూడు రోజుల్లో తర్వాతి చివరిభాగం వదుల్తా. కృతజ్ఞతలు.
@జ్యోతి గారికి,
సంతోషం చదివినందుకు. ఆజ్ఞ శిరసావహించగలవాడను.
@ఇందులో మొదటి Anonymous గారికి,
చాలా సంతోషం. కృతజ్ఞతలు.
@రెండవ అనానిమస్ గారికి,
ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే పదిమంది నా టపా చదివే సూచన చేసారు.
పీచు పీచుగా ఉంది. ఎందుకిలా పీక్కు తింటావు? మా జీవితం మీద నీకు విరక్తి కలిగిందా?
బావుంది..ఏవిటండీ విజయకుమార్ గారూ తెలుగు ధారావాహికలకు ఉత్కంఠ క్షణంలో వచ్చేవారం అనేసినట్టు మాంచి రసపట్టులో సశేషం వేశారు.
మూడవ అనోనిమస్ గారికి,
అమ్మా/అయ్యా, మీ జీవితం మీద నాకు విరక్తి ఎప్పటికీ కలగదు గానీ మీకు ఎటువంటి టపాలు కావాలో సూచించండి. రాయడానికి ప్రయత్నిస్తాను.
తెలుగువీర గారికి,
కృతజ్ఞతలు. అలా టపా మొదలెట్టానో లేదో యిలా బిజీలో పడిపోయా. కేవలం సమయాభావం వల్లనే రెండవభాగం రాయలేక పోతున్నా. వీలయినంత త్వరలో వదుల్తానని మీ అదరికీ మనవి చేసుకుంటూ. . .
Post a Comment