రక్తం గ్లాసు...3
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.
రక్తంగ్లాసు (కథ)
“మైగాడ్! పెరట్లోకా?” ప్రభాకర్ సంకోచించాడు. తర్వాత, “పదండి. మీకోసం వస్తాను.” అన్నాడు.
ఇంట్లో వున్న పలుగు ఒకదాన్ని తీసుకుని నేనూ, ప్రభాకర్ పెరట్లోకి నడిచాం. రాత్రి ఆ స్త్రీలు, బిడ్డ శవాన్ని పాతి పెట్టిన చోటుకెళ్ళి అక్కడ తవ్వాను. చిత్రం ఎంత సేపు తవ్వినా శవం కనిపించలేదు.
ప్రభాకర్ నా వైపు అనుమానంగా చూస్తూ, “మీరేమైనా పొరబడ్డారేమో! కంగారులో కలని నిజం అనుకుని. . .” అన్నాడు.
“షటప్!” ఇంకా ఏదో చెప్పబోయిన ప్రభాకర్ నా కళ్ళలో కోపం చూసి నోరు మూసేశాడు.
నిముషం సేపు మేం మాట్లాడుకోలేదు. తర్వాత, నేనే అన్నాను. “ప్రభాకర్ రేపు ఈవెనింగ్ ట్రెయిన్ కి హైదరాబాద్ కి రిజర్వేషన్ చేయించు.”
“రేపు దాకా ఎందుకు సార్! ఈ రోజు సాయంత్రానికే చేయిస్తాను. మళ్ళీ ఈ రాత్రికి ఏ లేనిపోని గొడవ ఎదుర్కోవాల్సి వస్తుందో.” అన్నాడు ప్రభాకర్.
“నో. రేపు ఈవెనింగ్ కే చేయండి.” అన్నాను
“మీ యిష్టం!” ప్రభాకర్ వెళ్ళబోయాడు.
“ప్రభాకర్!” వెళ్తున్న అతడు వెనక్కి తిరిగాడు.
“ఇక్కడికి దగ్గర్లో హాస్పిటల్ ఏదైనా వుందా?” అడిగాను.
“ఉంది సార్! తొమ్మిది పడకల హాస్పిటల్.”
“అక్కడ కాన్పులు చేస్తారా?” అడిగాను.
“చేస్తారు. ఏం?” అన్నాడు అర్థంగానట్టుగా.
“కాన్పు కష్టమై చనిపోయిన బిడ్డల్ని ఆ హాస్పిటల్ లో అమ్ముతారా?” అన్నాను అతడి కళ్ళలోకి చూస్తూ.
“ఏమిటి లాయర్ గారూ ఆ ప్రశ్న. ఆ సంగతి నాకేం తెలుస్తుంది?” అని, అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
* * *
రాత్రి తొమ్మిదయింది. రాత్రి గడిచేకొద్దీ నాలో ‘ఏంగ్జయిటీ’ పెరగసాగింది. వరండాలో, లాన్ లో, చివరికి నా బెడ్ రూమ్ తో సహా అన్నిచోట్లా లైట్లు వెలిగించాను.
కిటికీలతో సహా గదిలో అన్ని తలుపులూ బిగించి మూసేశాను. రివాల్వర్ తల దగ్గిరే పెట్టుకుని పడుకున్నాను.
సగం రాత్రప్పుడు నిద్రలోనే ఏదో కర్తవ్యం గుర్తొచ్చినట్టుయి గబుక్కున మేల్కొన్నాను. ఎదురుగా వున్న ‘వాల్ క్లాక్’ లో టైమ్ చూశాను. పన్నెండున్నర!
నా అజాగ్రత్తకి నన్ను నేనే తిట్టుకుంటూ ఎడంచేత్తో తలదగ్గరి రివాల్వర్ చేతిలోకి తీసుకోబోయి కుడిచేతికి ఏదో మెత్తగా, చల్లగా తగలడంతో అటు చూశాను.
అంతే, ఉలిక్కిపడి లేచి, ప్రాణాలు ఎగిరిపోయేట్టు వెర్రికేక పెట్టాను. అక్కడ నా మంచంలో నా పక్కలోనే కుడివైపున ఒక స్త్రీ శవం పడుకోబెట్టబడి వుంది.
ఆ శవాన్ని ఓ అయిదు నిముషాల పాటు చూస్తుండి పోయాను. నా గుండె దడ, భయం అంత సులభంగా తగ్గలేదు. ఓ పది నిముషాల తర్వాత మనసు స్తిమితపడగానే రివాల్వర్ చేతబట్టుకుని కోపంగా గోద్రెజ్ బీరువా వైపు నడిచాను.
* * *
“బీరువా తాళాలు ఎవరి దగ్గరుంటాయి రామరాజూ?” అడిగాను రామరాజుని హైదరాబాదుకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊరిలో జరిగిన కథంతా చెప్పి.
“అన్నీ నారయ్య దగ్గరే వుంటాయి.”
“సరే మీ పొలాలు కొనుక్కుంటే ఎవరికి ఎక్కువ ఉపయోగం వుంటుంది?” అన్నాను.
( సశేషం )

0 అభిప్రాయాలు:
Post a Comment