రక్తం గ్లాసు...4
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.
రక్తంగ్లాసు (కథ)
“మాణిక్యాలరావుకి. ఎందుకంటే అతడికి కూడా ఓ యాభై ఎకరాల దాకా పొలం వుంది. అవి మా పొలాల చుట్టూరా ఆనుకునే వుంటాయి. మాణిక్యాలరావు గనుక మా పొలాలు కొనుక్కుంటే పొలం అంతా కలిపి అతడికి ఒకే ‘బిట్’ కిందికి వస్తుంది. వ్యవసాయం సులభం. అయితే మా పొలాలన్నీ కొనగలిగే శక్తి మాణిక్యాలరావుకి లేదనుకో.” అన్నాడు రామరాజు.
“అయితే మాణిక్యాలరావుతో ప్రభాకర్ కి గానీ నారయ్యకి గానీ బంధురికం ఏదైనా వుందా?” అడిగాను.
“నారయ్యకేదో దూరపు బంధుత్వం వుందనుకుంటా! ఐనా మాణిక్యాలరావెక్కడ? వీడెక్కడ?” అన్నాడు రామరాజు.
“మీ యింట్లో వున్నది దెయ్యాలు కాదు రామరాజూ. మనుషులు. మాణిక్యాలరావూ, నారయ్యా కలిసి పంపిస్తున్న మనుషులు. ఆ దగ్గర్లో వుండే హాస్పటల్ లోంచి చనిపోయిన పిల్లల శవాల్ని తెచ్చి, ఎవరో కిరాయి ఆడవాళ్ళ చేత నాటకాలు ఆడిస్తున్నారు. అప్పటికీ భయపడకపోతే శ్మశానంలో పాతిపెట్టిన శవాల్ని కూడా తెచ్చి మంచంలో పడుకోబెడ్తున్నారు.” అన్నాను.
“ఎలా చెప్పగలవు?”
“వచ్చేటప్పుడు ఆ ఊరి శ్మశానంకెళ్ళి కాటికాపరిని కలిశాను. ఆ ముందురోజో స్త్రీ శవం మాయమయిందన్నాడు.”
“అంత దారుణానికి దిగారా? అయినా గదికి తలుపులు వేసుంటే రక్తం గ్లాసూ, శవాలూ గదిలో కెట్లా వస్తున్నాయి?”
“బీరువా తాళాలూ, స్టోర్ రూమ్ తాళాలూ నారయ్య దగ్గిరే వున్నాయి. రక్తంగ్లాసు టీపాయ్ మీద కన్పించిన రోజు బీరువామీద కూడా నాకు కొన్ని రక్తం మరకలు కనిపించాయి. అనుమానం వచ్చి ఆఖరురోజు బీరువా తలుపులు పగులగొట్టాను. బీరువా వెనుక ఆ గదికి గోడ లేదు. మనిషి పట్టేంత మేరకి పగుల గొట్టారు.”
“బీరువా వెనుకభాగం రేకుని కూడా కత్తిరించారు. బీరువా తలుపులు తీసి అవతలికెళ్తే నేరుగా స్టోర్ రూమ్ లోకి వెళ్ళవచ్చు. అలాగే అవతలి నుండి యిటు రావడానికి బీరువా తలుపులకి ఏర్పాట్లు చేసుకున్నారు. రక్తం గ్లాసుల్ని, శవాల్ని స్టోర్ రూమ్ లోంచి అన్ని గదుల్లోకి పంపిస్తున్నారు.”
“బీరువా గురించి ఎలా పసిగట్టగలిగావు?” అన్నాడు రామరాజు.
“నారయ్య స్టోర్ రూంలోంచి రక్తంగ్లాసు తెచ్చి డ్రాయింగ్ రూమ్ లో పెట్టేప్పుడు ఆ గ్లాసు కాస్త ఒలికి రక్తం మరకలు బీరువా కిందిభాగంలో పడ్డాయి. దాంతో బీరువా గురించి అనుమానం వచ్చింది.”
“అంతా బాగానేవుంది గానీ - ఇంతా చేస్తే మాణిక్యాలరావుకి ఏమిటి ఆదాయం?”
“నీ పొలం కొనగలిగే శక్తి, స్తోమత అతడికి లేవు. పొలంలో దెయ్యాలున్నాయనే ప్రచారం చేస్తే నీ పొలం కొనడానికి ఎవడూ రాడు. ఏదో నీకు సహాయం చేసినట్టుగా మాణిక్యాలరావే ముందుకి వస్తాడు. చౌకగా నీ పొలం కొని, తన పొలంలో కలిపేసుకుంటాడు - అదే ఆదాయం.”
“ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటావు?” అడిగాడు అచ్యుతరామరాజు.
“డబ్బు తీసుకోకుండా పొలం మాణిక్యాలరావుకి రాసియ్యాలి. లేదంటే పోలీస్ స్టేషన్ కెళ్ళి దెయ్యాల పేరుతో జనాల్ని బెదరగొడ్తున్నాడని ముందు మాణిక్యాలరావు మీద కేసు పెట్టాలి. సాక్ష్యంగా నన్ను పెట్టాలి.” ఒళ్ళు మండి అన్నాను.
“సరే. రేపే పోలీస్ కంప్లయింట్ ఇద్దాంలే!” అని, “ఏమీ తెలీక అడిగా మరీ అంతగా కోపగించుకోకోయ్ మైడియర్ ఫ్రెండ్ చక్రపాణీ!” అచ్యుతరామరాజు నన్ను ప్రేమగా కౌగిలించుకున్నాడు.
( సమాప్తం )

12 అభిప్రాయాలు:
intellegent!
కల్హర గారూ,
కృతజ్ఞతలు. మీ పేరు చాలా హృద్యంగానూ, తేనె తెలుగుదనంతోనూ నిండి వుంది.
కథ మంచి పట్టుగానే మొదలైంది కానీ, చివరికి వచ్చేసరికి చప్పున తేల్చేసినట్టనిపించింది. మొత్తంమీద బాగుంది కథ.
హమ్మయ్య... పూర్తిజేసి బ్రతికించారు. కథ బాగుంది.
@నాగమురళి గారికి,
ఇప్పుడే మీ బ్లాగులో శ్రీ రమణ గారి రచనలకి వ్యాఖ్య రాసి వచ్చేలోపు మెయిల్ లో మీ వ్యాఖ్య కనిపించింది. కృతజ్ఞతలు. నిజానికి కథ A4 సైజులో యింకో పేజీ వుండేది. ఎడిటింగ్ లో పోయింది. అయినా స్వాతి వారికి ఎనిమిది పేజీలు మించి కథ వుండకూడదనే నిబంధన వుంది. ఆ లెక్కన నా కథ యింకా పెద్దదే అయింది.
@రాఘవ గారూ,
లేటయినందుకు సారీ సార్. మీరంతా అంతగా ఎదురుచూస్తున్నారని తెలిస్తే కాస్త త్వరగా రాసివుండేవాడిని. నేను కావాలని ఆలస్యం చేయలేదు. నిజంగానే టైపు చేసే తీరికలేక లేటయింది. ఎనీ హౌ కృతజ్ఞతలు.
Good story! I remember reading this one in Swathi weekly. Happy to read it again in your blog.
చాలా సంతోషం సార్ సోమ శంకర్ గారూ. మీ చేత నా కథ రెండో సారి చదివించగలిగాను ఈ బ్లాగుల పుణ్యమా అని. కృతజ్ఞతలతో. . .
నాకు ఏ కధ అన్నా ఏకబిగిన చదవడం అలవాటు.నవలలు అయినా సరే పట్టుకుంటే పూర్తవ్వాల్సిందే.అందుకే మీకధ చివరి భాగం వచ్చే వరకు చదవలేదు.అన్నీ కలిపి చదివాను.బాగా భయపెట్టారు.ఇంకొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టది చెప్పుంటే ఇంకా ఆశక్తిగా వుండేదేమో?
రాధిక గారికి,
నిజమే. మీరన్నట్టు ఎవరికైనా రోజుకో ముక్క చదవడం పెద్దగా యిష్టం వుండదు. ఆ ప్రకారం రాయాలంటే నేనిక్కడ కథనంతా మొత్తం ఒకేసారి టైపు చేసి, ఒకేసారి పోస్ట్ చేయాలి. నాకు సమయం తక్కువ. పైగా ఒకేసారి పోస్ట్ చేస్తే అది కూడలిలో ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. రీడర్స్ కూడా యిప్పటిలా వుండరు. కనుక యిలా ముక్కలు చేయడమే మేలని భావించా. ఇక మీరు చెప్పిన కథలో క్లైమాక్స్ గురించి. ఇది స్వాతిలో పోటీ కోసం వెళ్ళి సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ. పైన నాగమురళి గారికి ప్రశ్నకి సమాధానంగా నేను రాసిన వ్యాఖ్య ఒకసారి చదవగలరు. కృతజ్ఞతలతో. . .
Unedited కథనే ప్రచురించకపోయారూ...
రాఘవ గారూ,
ఇది 2001 లో రాయగా 2002 లో ప్రింటయింది. ఇప్పుడు ఆ చిత్తు ప్రతి కథ నా దగ్గర లేదు. రాయాలంటే మళ్ళీ తిరిగి ఆలోచించి కొంత జోడించాలి. అప్పుడు స్వాతిలో ప్రచురించబడిన నా కథ అని రాయడానికి వీలుండదు.కృతజ్ఞతలు.
Post a Comment