ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, November 27, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...2

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

ఇక ‘చలం’ గురించి. ఆచార వ్యవహారాల పేరుతో బానిసగా మారిన స్త్రీమూర్తిని చూసి చలం చలించిపోయాడు. పురుషుడు ముద్దు పెట్టుకుంటేనే గర్భం వస్తుందనుకునే మానసిక పరిణతి లేని స్త్రీలు ఆనాటికే 25 శాతం మంది వున్నారన్న కొన్ని నగ్నసత్యాల్ని గ్రహించి విల విలలాడాడు. స్త్రీ శరీరానికీ, మనసుకీ వ్యాయామం కావాలని ఎలుగెత్తి చాటాడు. స్త్రీని విశ్వకేంద్రంలో నిలిపి, కలాన్ని సమ్మెటగా చేసి ఆమె దాస్య శృంఖలాల్ని పగులగొట్ట బృహత్ ప్రయత్నించినాడు. ఎంత విశృంఖలత వుందనుకున్నా చలం రచనలు సాధించిన ఘనత తక్కవేమీ కాదు. అవి ఆంధ్ర వాజ్ఞయంలో తగిన స్థానం సంపాదించుకోగలిగాయి. యావత్ తెలుగుజాతి ఆలోచనా విధానాన్ని ప్రభావితంజేసి, తెలుగువారి దృక్పథంలో నూతనత్వానికి శ్రీకారం చుట్టాయి. ఒకనాడు తెలుగు సాహితీ ప్రపంచమే సంచలనాత్మక రచయిత వైపు దృష్టిసారించి అబ్బురపడిందన్న విషయం మనం మరువలేనిది. ఆపైన ఆథ్యాత్మిక చైతన్యం పొందిన చలం మాటలకు విలువ వుంటుందని నేననుకోను. ఒక్క చలమే కాదు ఆథ్యాత్మిక చైతన్యం పొందిన ఏ వ్యక్తి మాటలకైనా ఆథ్యాత్మిక విలువ తప్ప సామాజిక విలువలు వుండవు. ఎందుకంటే ఆథ్యాత్మిక మానవుడికి అన్ని విలువలూ సమానమే. భావాల హెచ్చుతగ్గుల వివక్ష వుండదు. అప్పుడే ఆథ్యాత్మికం సాధ్యం కూడా. ఏది ఏమైనా స్త్రీకి స్వేచ్ఛని ప్రసాదించాలనే తీవ్ర తాపత్రయంలో భారతీయ కుటుంబ వ్యవస్థనూ, పసిపిల్లల భవిష్యత్తునూ చలం విస్మరించారనే విషయమూ విమర్శలకు నోచుకుంది.

కానీ, గడచిన రెండు దశాబ్దాలకాలంలో ఆధునిక స్త్రీ తన దాస్య శృంఖలాల్ని తనే ఛేదించుకోవాలనే స్వీయ జ్ఞానాన్ని పొందింది. నడుం బిగించి ఆ దిశగా తనకి తానుగానే ఉద్యమించింది. ఆ క్రమంలో ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. పురుషుడితో సమానంగా ఆమె ఆర్థిక స్వావలంబన సాధించుకుంది. తన ప్రాణ, మాన సంరక్షణ కోసం తగువిధంగా చట్టాలు రూపొందించుకోగిలిగింది. అయినా, కనుచూపు మేరలో ఆమె సామాజిక స్వేచ్ఛ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా వుండిపోయింది.

అదే చట్టాలు సంఘంలో బరితెగించిన స్త్రీ వ్యక్తులకు మారణాయుధాలై చేతికందాయి. మంచి ప్రవర్తన గల మగవాళ్ళు సైతం ఈ చెడు మార్గాన్ననుసరించిన స్త్రీల చేత భంగపడిన సంఘటలలు ఇటీవల కోకొల్లలు. వరకట్నం ఊసెత్తని పురుషుడ్ని సైతం తనకి అభిప్రాయభేదం కలిగినప్పుడు స్త్రీలు వరకట్నపీడితుడిగా కోర్టుల కీడ్చి శిక్షింపజేయడం వంటి సంఘటనలు ఎంతైనా అమానుషం. ఇటువంటి స్త్రీలు తమని సామాజిక, ప్రాణ సంరక్షణకోసం ఏర్పడిన చట్టాల వెనుక స్త్రీ వేదననూ, బాధలనూ గుర్తించిన పురుషులు అనేకులున్నారన్న విషయం విస్మరించరాదు. కేవలం స్త్రీల వల్లనే ఆయా చట్టాలు రూపొందించబడలేదు. సరిగ్గా యిక్కడే పురుషుడు కూడా స్త్రీని ద్వేషించడం, తనకి బాధాకరంగా పరిణమించిన చట్టాల్ని దుయ్యబట్టడం జరిగింది.

ఏదియేమైనా, పురుషుడు తన జాత్యహంకారం మూలంగా స్త్రీ అనాది నుండీ అణచివేతకి గురైనదన్న విషయం అంగీకరించక తప్పదు. అదే విధంగా స్త్రీలు తమకి అణ్వాయుధాలై చేతికందిన ‘ఉమెన్ ప్రొటెక్షన్’ వంటి కేసుల్ని తప్పుడు పోకడలకు కాక నిజమైన తప్పిదం జరిగిన చోట మాత్రమే వాడుకోవడం సమంజసం. ఎందుకంటే, మానవజాతిలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. అలాగే స్త్రీ విషయంలో కూడా. అలా స్త్రీ పురుషులిద్దరూ సమదృష్టితో మెలగినంత కాలమే మానవత్వానికి మనుగడ. మానవజాతి మనుగడ. కడకి మనిషికే మనుగడ. ఆ అవగాహన నశించిన రోజున మనకి మిగిలేది శూన్యం.

చివరగా ఒకమాట. ఆచారాల పేరిట, కట్టుబాట్ల పేరిట, మతాల పేరిట స్త్రీ అణచివేతకి గురైందన్న విషయం నూరుకి నూరు పాళ్ళూ సత్యమనడానికి ఎన్నో తార్కాణాలు అవసరం లేదు. స్వంతంత్రించి, ఒక్కటే ఒక్కటి ఉదహరిస్తాను.

స్త్రీ శరీరం యావత్తూ పురుషుడి స్వంతమేనన్నది విశ్వసత్యం. అటువంటి పురుషుడి సొత్తైన స్త్రీ శరీరపు వంపు సొంపుల్నీ, ముఖ సోయగాల్నీ, లావణ్యాన్నీ, సుకుమారతనీ పురుషుడు వీక్షించి, తరించి, తథాత్మ్యం చెందాల్సిన స్త్రీమూర్తి గీర్వాణ సౌందర్యాన్ని ఒక మతం వారు నల్లముసుగులు వేసి మరుగు పరిస్తే, ఆ స్త్రీలు ఏ పాపమూ ఎరుగకుండానే ముసుగుదొంగలకి మల్లే మన మధ్యనే సంచరిస్తుంటే, సహజీవిస్తుంటే మనసున్న ఏ మనిషికైనా ప్రస్ఫుటంగా తెలీడం లేదా చరిత్రలో స్త్రీమూర్తి నిస్సందేహంగా అణచివేతకు గురైనదని, ప్రస్తుతం గురౌతూనే వున్నదన్న విషయం.

ఇంతకుమించిన తార్కాణాలు కావాలంటారా?

(సమాప్తం)

Monday, November 26, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...1

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

మౌలికంగా ప్రపంచంలో వున్నది మానవజాతి ఒక్కటే. స్త్రీజాతి, పురుషజాతి అంటూ విడివిడిగా లేవు. కాకుంటే స్త్రీలనైనా, పురుషులనైనా ఒక సమూహంలా చెప్పుకోవాల్సివచ్చినప్పుడు మనం స్త్రీ జాతనో, పురుషజాతనో చెప్పుకోవడం అనవాయితీ అయింది.

ఇక సువర్చల, నూర్జహాన్, డయానా యిలా విడి విడి స్త్రీల గురించి కాకుండా ప్రపంచ స్త్రీ అంటే విశ్వజనీన స్త్రీ నిస్సందేహంగా లింగ వివక్షకూ, అణిచివేతకూ గురైంది ప్రకృతి పరంగా చెప్పాలంటే ఆమెకి పెద్ద అన్యాయమే జరిగింది. ఇంతకుముందు నేను ఇదే బ్లాగులో రాసిన “ఇంటిపేరు పురుషుడిదే-ప్రకృతి న్యాయం” టపాలో వలెనే పురుషుడికి ప్రకృతి పరంగా లభించిన ఇంటిపేరుని సాంఘిక, ఆర్థిక పరమైన విషయాలకు అన్వయించి (ఇది నా ఊహ మాత్రమే) ఆమెకు ఆస్తిహక్కు లేకుండా చేయడం మూలంగా స్త్రీకి చరిత్రలో దారుణమైన ద్రోహం జరిగిందన్నది నిర్వివాదాంశం. ఇక స్త్రీమూర్తికి ప్రకృతి పరంగా లభించిన మరో వరం మరియూ శాపం గర్భం. గర్భం ధరించడం మూలంగా ఆమె పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న విషయం ప్రపంచానికి వెల్లడవుతుంది. ఆ కారణంగా ఆమె కొన్ని అంక్షలకి, కట్టుబాట్లకి గురైంది. అలాగే ఋతుక్రమం. ఇది కూడా ఆమె పాలిట శాపంలా పరిణమించింది. ఈ బాధలన్నీ పురుషుడికి లేవు. ఇదే, సరిగ్గా ఇక్కడే పురుషుడి చేతికి వజ్రాయుధం లభించింది. స్త్రీకి రౌరవ నరకమూ సంప్రాప్తమయింది. ఆపైన, పరిణామంలో ఏర్పడిన సతీసహగమనాలు మొదలుకుని ఇనుప కచ్చడాలూ, గృహనిర్భంధాలూ, ఆచారం కట్టుబాట్ల పేరిట భర్త చనిపోయిన స్త్రీ గుండు గీయించుకుని, తెల్లబట్టలు ధరించి శరీర కోర్కెలు చంపుకోవడం వరకూ జరిగిన నానా విధాల దురాచారాలూ మనకి తెలీనివి కావు. కడకి యివన్నీ మానవత్వానికే కళంకంలా, తీరని మచ్చలా పరిణమించాయి.

మొన్న ఒక పురుష బ్లాగరు ఒక సందర్భంలో అన్నారు. ఇలా స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు “సంబంధం పెట్టుకుని పరస్పరం ద్వేషించుకోవడం కంటే ఆడవాళ్ళు మగవాళ్ళ సహచర్యం పూర్తిగా వదులుకోండి. ఆలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ సహచర్యం పూర్తిగా వదులుకోండి” అని. ఏదో ఆవేశంలోనో, ఆవేదనలోనో ఆయన అన్నారే గానీ, అది అసంబద్ధమైన మాట. అదే జరిగితే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నది జగమెరిగిన వాస్తవం!

మళ్ళీ ఆయనే, “ఆడవాళ్ళకి ఏడవడం చేతనయితే, మగాళ్ళకి కోపం తెచ్చుకోవడం చేతనవుతుంద”న్నారు. ఇది కోపం, అలక, ఏడ్పు లాంటి మనో వుద్రేకాల స్వరూపం గురించి తెలీక అన్నమాటగా నేను భావిస్తున్నాను. అలక, ఏడ్పు అసహాయత లోంచి జన్మిస్తాయి. కోపం అనబడేది ఆధిక్యతలోంచి పుట్టింది.

ఉదాహరణకి ఒక పురుష ఉద్యోగి వున్నాడనుకుందాం. అతడి పై అధికారి(ణి) ఒక స్త్రీ ఉద్యోగిని అనుకుందాం. పై అధికారిణి అంటే మామూలు సాదా సీదా పై అధికారిణి కాదు. అతడి ‘అపాయింటింగ్ అథారిటీ’ ప్లస్ ‘డిస్ మిస్సల్ అథారిటీ’ కూడా అమే అనుకుందాం. అటువంటి లేడీ బాస్ తన తప్పే అయినా, అకారణంగానే అయినా సదరు పురుష ఉద్యోగిని తీవ్రంగా దూషించిందనుకుందాం. అప్పుడు ఆ పురుష వుద్యోగి నేను పురుషుడ్నిగదా అని ఆమెపై కోపగించుకుని ఉద్యోగం వూడగొట్టుకుంటాడా. లేక అలిగి మాట్లాడకుండా ఊరుకుంటాడా. నేనైతే అలగుతాడనే అనుకుంటా (ఒకవేళ ఏడ్వలేక పోయినా). కనుక అలక, ఏడ్పు లాంటివి అసహాయతకి చిహ్నాలు. అలాగే కోపం ఆధిక్యతకి చిహ్నం. ప్రకృతి, ఆర్థిక, సామాజిక పరమైన కారణాల వల్ల స్త్రీ అసహాయురాలైంది. తన నిరసన తెలియజేయడానికి అలకనూ, ఏడ్పునూ ఆశ్రయించింది. అలాగే పురుషుడు ఆగ్రహించడమూ జరుగుతూ వస్తున్నది.

(సశేషం)

Saturday, November 17, 2007

స్నానఘట్టం!..4

ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.

స్నానఘట్టం! (కథ)

ఒకరోజు వేకువఝామున అయిదు గంటలప్పుడు పుష్పాంజలి ఇంట్లో నుండి ఎవరిదో స్త్రీ ఏడుపు వినిపించి, నేను నిద్రలోనుండి లేచి వెళ్ళి తలుపు దగ్గర చేరాను.

ఓ నలభై అయిదేళ్ళ మగాడితో పుష్పాంజలి వాళ్ళమ్మ ఏడుస్తూ మాట్లాడుతోంది. పుష్ఫాంజలి కూడా ఆ పక్కనే కూర్చుని వుంది. నేను వాళ్ళ మాటలు శ్రద్ధగా వినసాగాను.

“అది కాదురా మల్లయ్యా! నేనేమైనా కోరరాని కోరిక కోరుతున్నానా? ఆ పిల్లకి వుద్యోగస్థుడ్ని ఎవర్నైనా తెచ్చి చేయాలనుకుంటున్నాను. అది తప్పా?” అంటోంది వాళ్ళమ్మ.

“బయట కట్నాల సంగతి నీకు తెలీదక్కా. ఉద్యోగస్థులంటే మాటలనుకుంటున్నావా?” అన్నాడా వ్యక్తి.

“ఏదైనా మంచి కంపెనీలో చిన్న వుద్యోగైనా ఫర్లేదు చేసుకుంటానంటోందిరా పుష్పాంజలి. ఎటూ దాని అక్కలిద్దరికీ తేలేకపోయాం.” అందామె కన్నీరు తుడుచుకుంటూ.

“నిజమేనే అక్కా మనకి శక్తి వుండాలిగా?” అన్నాడతను సిగరెట్ తీసి వెలిగించుకుంటూ.

“వాళ్ళ నాయన దానికోసం అట్టిపెట్టిన స్థలం అమ్మితే ఒక లక్షరూపాయలొస్తాయి. ఎటూ పిల్ల బాగుంటుంది గనుక మీరంతా తలా ఒక చెయ్యి వేశారంటే దాని పెళ్ళి పెద్ద కష్టం కాదనుకుంటా.” అందామె.

“ఏం సహాయాలు చేయగలమే అక్కా. ఎవరి బాధలు వాళ్ళవి. నాకూ ఒక ఆడపిల్ల వుంది. నేనూ దాని బాగోగులు చూసుకోవాలి గదా. నావరకూ నేనైతే ఒక అయిదువేలియ్య గలను. పెద్దన్నయ్య ఎంతిస్తాడో కనుక్కో.” అన్నాడాయన తన శక్తిని తెలియజేసి, చేతులు దులిపేసుకుంటూ.

ఆ తర్వాత వాళ్ళ సంభాషణ నేను వినదలచుకోలేదు. కోట్లు కుమ్మరించినా కొనలేని చక్కదనాన్ని కోమటి కొట్లో గుమాస్తాకిచ్చి గొంతుకోసే ప్రయత్నాలూ, అశక్తత పేరుమీది యుక్తులూ కుయుక్తులూ నేను వినను. వినలేను కూడా.

* * *

రెండు రోజులు గడిచింది.

ఆ తర్వాత రోజు సాయంత్రం అకస్మాత్తుగా మా యింటి ఓనరొచ్చి మమ్మల్ని ‘ఆ నెలాఖరుకి గదులు ఖాళీ చేయమ’ని చెప్పాడు. ‘అంత అకస్మాత్తుగా మమ్మల్ని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింద’ని అడిగాను నేను. ఎవరో ఒకతను వచ్చి మేం యిస్తున్న అద్దెకి మూడు రెట్లు అద్దె యిస్తానన్నాడట. అందుకే మమ్మల్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందన్నాడాయన. పైగా బుద్దిమంతులమైన మమ్మల్ని అర్థాంతరంగా ఖాళీ చేయించాల్సి వచ్చినందుకు బాధని వెలిబుచ్చాడు కూడా.

“ఆ మూడు రెట్లు అద్దె యిస్తానన్నవ్యక్తి పేరేమిటి?” అని అడిగాను నేను.

“ఉమేష్ గారట.” అన్నాడాయన.

నాకు అర్థమైపోయింది. ఉమేష్ గాడు ఆరోజు పుష్పాంజలిని చూడలేక పోయాననే అక్కసుని మనసులో పెట్టుకుని యింతకి తెగించాడు.

నాకు అక్కడనుండి వెళ్ళిపోవలసి రావడం బాధను కలిగించినా, అదీ మంచిదేననిపించింది.
అలాగేనన్నాను.

* * *

ఆరోజు నెలాఖరు. గది ఖాళీ చేయాల్సిన రోజు.

నేను ప్రక్కవీధిలో వేరే గది అద్దెకి మాట్లాడుకున్నాను. ఒకటి రెండు పరుపులు మినహా యించుమించు సామానంతా అక్కడకి చేరవేయడం కూడా జరిగిపోయింది. ఇంటి ఓనరొచ్చి గది ఖాళీ చేయమన్నరోజు రాత్రి చంద్రంగాడ్ని నేను బాగా తిట్టడం జరిగింది. వాడు అలిగి అప్పట్నుంచి గదికి రావడం మానేశాడు. బహుశా ఆ శీనుగాడి గదిలో మకాం పెట్టివుంటాడనుకున్నా.

సమయం ఉదయం ఆరు గంటలు కావస్తోంది. అది పుష్పాంజలి స్నానం చేసే సమయం.

ఆ గదిలో నాకదే ఆఖరురోజు కాబట్టి చివరిసారిగా పుష్పాంజలిని చూసి వెళ్దామనుకున్నాను. అందుకోసమే వెయిట్ చేయసాగాను. మరో పది నిముషాలు గడిచాక నీళ్ళబిందె చప్పుడైంది. నిశ్శబ్దంగా నడిచి, తలుపు దగ్గరకి చేరుకున్నాను. యథాప్రకారం బొక్కబోర్లాపడి లోపలికి చూడబోయాను.

అంతే!

“థడేల్!” మన్న చప్పుడుతో అక్కడి తలుపు తెరుచుకుంది. ఉగ్రస్వరూపిణిలా మారిన పుష్పాంజలి అక్కడ నిల్చుని వుంది.

ఆ హఠాత్పరిణామానికి నేను బిత్తరపోయి చటుక్కున లేచి నిలుచున్నాను. అసంకల్పితంగానే తలవంచుకుని “క్షమించండి.” అన్నాను.

పుష్పాంజలి నన్ను తీక్షణంగా చూసింది. ఉఛ్వాస నిశ్వాసలతో ఆమె గుండెలు ఎగసెగసి పడుతున్నాయి. ఆ రాత్రంతా ఏడ్చినట్టు ఆమె ముఖం వాచి ఎర్రబారి వుంది. ముక్కుపుటాలు అదురుతున్నాయి.

ఆమె నన్ను తీవ్రంగా చూస్తూ, “ఇది క్షమించగలిగే తప్పా?” అంది.

నేను మాట్లాడలేదు.

ఆమెకి దుఖః కట్టలు తెంచుకుంది. గట్టు తెగిన గోదారిలా ఆమె కళ్ళలో కన్నీరు పొర్లుతోంది.

“రోజుకొకరు చొప్పున మగాళ్ళని గదికి తీసుకొచ్చి మేం స్నానాలు చేసేప్పుడు చూపించడం క్షమించగలిగే తప్పా?” ఆమె గద్దించింది.

నేను దించిన తల ఎత్తలేదు.

“చెప్పు. చెప్పవేం?” ఆమె నిలదీసింది.

ఏమని చెప్పను నా సిగ్గులేని తనాన్ని. అలాగే మౌనంగా వుండిపోయా.

“పేదవాళ్ళం. మగదిక్కు లేనివాళ్ళం. ఏపూటకాపూట గడుపుకుంటున్న వాళ్ళం. మా బతుకులు బజార్న పెట్టారు. మీరు చేసిన ఈ పనికి యిప్పుడు ఈ ఊరొదిలి మేం దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడ మేం ఎట్లా బ్రతకాలి?” అంది దిక్కుతోచనట్టుగా.

ఆ మాట భరించలేక పోయాను. చివ్వున తలెత్తి చూశాను.

“అయ్యో ఎక్కడికి వెళతారు?” అన్నాను మాటలకోసం తడుముకుంటూ. బిగిసడలని పశ్చాత్తాపం నన్ను కృంగదీసింది.

“మా చావేదో మేం ఛస్తాం. ఇట్లా యింకెవరి బ్రతుకులూ పాడుచేయకండి.” చేతులెత్తి నమస్కరించింది.

నేను నిరుత్తురుడనై నిలుచుండిపోయాను.

నన్ను చూసిపోయిన ప్రబుద్ధుల్లో ఎవరో పాపం నామీద దయతో ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. లేకుంటే మా బ్రతుకులింకెంత ఎగతాళి పాలయ్యేవో? ఈ ఉత్తరం నేను చూసాను గనుక సరిపోయింది. మా అమ్మకి తెలిస్తే ఉరేసుకు చచ్చివుండేది.” అంది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

చేతిలో ఉత్తరం నామీదికి విసిరికొడుతూ, “ఛీ! మీరు కూడా మనుషులా?” అంది జిగుప్సగా. మళ్ళీ ఏడుస్తూ, లోపలికి వెళ్ళి “ధఢేల్” మని నా ముఖం మీద తలుపువేసింది.

నేను వెనక్కి తిరిగాను.

మర్యాదస్థురాలు గనుక ‘మీరు కూడా మనుషులా?’ అని అడిగి సరిపెట్టింది పుష్పాంజలి. మరింత గడుసుదైతే ‘మీకు అక్కాచెల్లెళ్ళు లేరా. వాళ్ళనీ యిలాగే చూపిస్తారా?” అని వుండేది. మరింత చిల్లర రకమైతే ముఖాన వుమ్మేసి, చెప్పుతో కూడా కొట్టి వుండేది. లేదంటే అందర్నీ పిలిచి కొట్టించి వుండేది.

నిజమే మా తప్పులకి తనని శిక్షించుకోదలపెట్టిన ఆమె సంస్కారం ముందు మేం ఎన్నటికీ మనుషులం కాకపోవచ్చు. ఎందుకంటే చేసింది సరిదిద్దుకునే తప్పు కాదు.

మానభంగం చేసివుంటే పెళ్ళి చేసుకుని సరిదిద్దుకోవచ్చు. కడుపు చేసి వుంటే దాన్ని తీయించి సరిదిద్దుకోవచ్చు. కానీ, వివస్త్రగా పదిమందికీ చూపించిన స్త్రీకి ఏంచేసి తప్పు సరిదిద్దుకోవాలో నాకు తెలీలేదు. పోనీ ఆర్థిక సహాయం చేద్దామంటే అదామె సౌందర్యానికి వెలకట్టిన పడుపుసొమ్మయి కూర్చుంటుంది. ఆ మాటే గనుక నేనంటే పుష్పాంజలి అప్పుడు నిజంగా నన్ను చెప్పుతో కొట్టి తీరుతుంది.

విషాదభరిత వేదనాశ్రువులు నా కళ్ళ వెంట వర్షించసాగాయి.

నేను దేవుడి పటం వైపు నడిచాను. వంగి మోకాళ్ళ మీద కూర్చున్నాను. ముకుళిత హస్తాలతో మానసం భగవంతునిపై లగ్నంచేసి. . .

“ప్రభూ! గాలిపడగ దారం వీడింది. గాలిలో పయణం కట్టింది. ముళ్ళకంప నంటకమునుపే, ముసురు వానన మునగక మునుపే. మరే మురికి మూలనో చేరక మునుపే. . .తండ్రిలేని పేదింటి పిల్ల. ఆమెని కాపాడు. ఏ జీవనస్వామికో అందించు. ఇదే నా జీవితకాలపు వేడికోలు!”

(సమాప్తం)

(ఒక స్నేహితుడు చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ కల్పించబడింది. హైదరాబాదు వంటి ఇరుకు నగరాలలో యిటువంటివి సర్వ సాధారణం. కనుక అద్దె ఇళ్ళలో, క్రింది ఫ్లోర్ అపార్ట్ మెంట్ లలో వున్న స్త్రీమూర్తులారా ఎక్కడైనా కుర్రాళ్ళు పొంచి వుండగలరు గనుక తస్మాత్ జాగ్రత్త! -- రచయిత)

(అలాగే మొదట్లో యిది నా ఏభైయ్యవ టపా అన్నాను. చూస్తుండగానే ఈ కథతో యాభైమూడవ టపాలోకి వచ్చేశాను. ఏమనుకోకండే. ఉంటాను-రచయిత)

Friday, November 16, 2007

స్నానఘట్టం!..3

ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.

స్నానఘట్టం! (కథ)

పుష్పాంజలి నగ్నదేహాన్ని చంద్రం చూడటం నాకు బాధని కలిగించింది. భయం కూడా వేసింది. ఎందుకంటే సౌందర్యపు మహాత్మ్యాన్ని గుర్తించి, దాన్ని నిగూఢంగా తనలోనే ప్రక్షిప్త పరుచుకోగల శక్తీ, సంస్కారం వాడిలో వున్నాయో, లేవో నాకు తెలీదు.

మరో అరనిముషం తర్వాత వాడు పైకి లేచాడు. విభ్రమం చెందినట్టు వాడి ముఖం తెలుస్తూనే వుంది. వాక్కాయ కర్మలన్నీ నశించినట్టు మాటా పలుకూ లేకుండా లేచివెళ్ళి మంచం మీద కూర్చున్నాడు.

“చంద్రం!” అన్నాను నేను వెళ్ళి వాడికెదురుగా ఛైర్లో కూర్చుంటూ.

క్షణం తర్వాత వాడు స్వప్నంలోంచి మాట్లాడుతున్న వాడిలా, “గురూ. ఏంటి గురూ యిది. ఎలా కనిపెట్టేవ్ అక్కడ్నుంచి కనిపిస్తుందని?” అన్నాడు.

“ఏదో అనుకోకుండా చాశాలే.” అన్నా.

“ఏమైనా నీకు హాట్సాఫ్ గురూ!” అని, “గురూ నాకో హెల్ప్ చేస్తావా?” అన్నాడు మళ్ళీ వాడే.

“ఏమిటి చెప్పు”

“నాకు ఇమ్మిడియట్ గా పెళ్ళి చేసెయ్ మని మా నాన్నగారికో ఉత్తరం రాసెయ్ గురూ.” అన్నాడు.

నాకు నవ్వొచ్చింది. “ఎవరితో. . .పుష్పాంజలితోనా?” అన్నాను.

“అయ్ బాబోయ్!” అదిరిపడ్డట్టుగా అని, “ఎవరోవొకరు. . .స్నానం చేసేప్పుడు నువ్వు చూడని పిల్ల.” అన్నాడు.

“సర్లేగానీ ఈ విషయం ఎవరితో అనకు. పుష్పాంజలి పెళ్ళిగాని పిల్ల.” అన్నాను.

“అయ్ బాబోయ్ యిదెక్కడి కండిషన్ గురూ? నువ్వేమన్నా అనుకో ఈ సంగతి శీనుగాడికి చెప్పి, ఈ బాత్రూం సీను వాడికి చూపించందే నాకు నిద్రపట్టదు.” అన్నాడు వెంటనే

నేను గతుక్కుమన్నాను. “అట్లా చేయడం తప్పు కదా చంద్రం” అన్నాను.

“తప్పోఒప్పో నాకు తెలీదుగానీ నువ్వుమాత్రం పోస్టాఫీసుకెళ్ళి నేను చెప్పిన పనిమీదుండు.” హాస్యధోరణిలో అంటూ అక్కడే వున్న బకెట్ అందుకున్నాడు.

“జోకులు తర్వాత గానీ చంద్రం దయచేసి ఈ విషయం ఎవరికీ. . .” నేనింకా మాట పూర్తిచేయకముందే. . .

“అల్పుడ్ని గురూ. నిగ్రహం లేనివాడ్ని. నన్నొదిలెయ్. . .ముందు బాత్రూమ్ కెళ్ళనీ.” అంటూ బాత్రూంవైపు పరుగులు తీశాడు.

* * *

ఆరోజు నుండీ పుష్పాంజలిని అలా చూడటం మాకు అలవాటైపోయింది. రోజూ ఏ ఎనిమిది తొమ్మిది గంటలకోగానీ నిద్రలేవని చంద్రంగాడు ఆ మరుసటిరోజు నుండీ అయిదు గంటలకే లేచి తలుపు దగ్గర మాటువేయడం ప్రారంభించాడు. ఆ రెండోరోజు సాయంత్రం వాడి ఫ్రెండు శీనుగాడ్ని వెంటబెట్టుకొచ్చి, ఆ రాత్రి మా గదిలోనే నిద్రజేయించి వుదయాన్నే పుష్పాంజలి స్నానకార్యక్రమం చూపించి, ఆమె అందచందాల మీద చర్చలు జరిపి, వాడిని హోటల్ కి తీసుకెళ్ళి టిఫిన్ తినిపించి మరీ పంపాడు. అక్కడ నాది ప్రేక్షక పాత్రే అయింది. ఏం చేయను శీనుగాడితో వాడి స్నేహం అంత ప్రగాఢమయింది మరి.

ఆ తర్వాత పదిరోజులు గడిచేసరికల్లా ఒక్క శీనుగాడేం ఖర్మ. . .ప్రసాదు, రంగనాయకులు, ఇమ్మాన్యుయేలు, వెంకటేశ్వరరావు, లింగంబాబు, అల్లాబక్షు, ప్రకాశం అందరూ మా యింట్లో విడిదిచేసి వెళ్ళడం జరిగింది. పైగా మా ఆఫీసులో యిదో ‘బర్నింగ్ టాపిక్’ అయిపోయింది. ఎవరినోట విన్నా పుష్పాంజలి నగ్నదేహ సౌందర్య వర్ణణే. ఎవరు చూసినా మా అదృష్టానికి అసూయపడేవాళ్ళే. నాకిది అత్యంత బాధాకరంగా పరిణమించింది.

మా రూమ్ కి వచ్చేపోయే వాళ్ళదాడి చూసి నాకు భయం వేసేది. ఎందుకంటే మాది ఐదొందల మంది వుద్యోగులున్న ఆఫీసు. ఈ విషయం మాయింటి ఓనరుగ్గానీ, ఆ వీధిలో వాళ్ళకిగానీ తెలిస్తే మా గతేంటో నాకు తెలుసు. ఆడపిల్ల బ్రతుకు బజార్లో పెట్టినందుకు కుక్కని కొట్టినట్టు తరిమి, తరిమి కొట్టడం జరుగుతుంది. అదేగాక ఈ విషయం పుష్ఫాంజలికి తెలిస్తే ఏమౌంతుందో ఆమె ఎలా ప్రతిస్పదింస్తుందో. . .గుట్టుగా జీవితం గడుపుకునే మర్యాదస్థుల పిల్ల. ఏ అఘాయిత్యమో చేసుకుని చనిపోతే?

ఈ విషయాలన్నీ నేను చంద్రంగాడితో వివరంగా చెప్పి, ఈ జనాల ప్రభంజనం ఆపాలని ప్రయత్నించాను. వాడు నా మాటలన్నీ ఒక్కమాటతో తీసేసి, “ఉండు గురూ! నీది మరీ చాదస్తం మన ఆఫీసెక్కడ. రూమెక్కడ? పదిహేను కిలోమీటర్ల దూరముంది. ఎవరికీ తెలిసే అవకాశమే లేదు.” అంటూ నాలుక చప్పరించేశాడు.

పుష్ఫాంజలి వాళ్ళింటికి ఎవరైనా బంధువులొస్తే చంద్రంగాడికి ఆరోజు మహాపండుగ. ఎందుకంటే ఆ బంధువుల్లో కొందరు ఆడవాళ్ళంటూ వుంటారు. ఆడవాళ్ళంటూ వుంటే వాళ్ళు స్నానాలంటూ చేస్తారు. స్నానాలంటూ చేయడం జరిగితే వీడు చూడడమంటూ జరిగి తీరుతుంది. రుచులు, రకరకాల రుచులు, విభిన్న రకాల రుచులు! వాడి ఆనందానికి అంతుండేది కాదు.

నేను ‘చంద్రంగాడ్ని వదిలేసి వేరే రూమ్ వెదుక్కుందామా వద్దా’ అనే డైలమాలో వుండగానే, ఒకరోజు పుష్ఫాంజలి అక్కలు యిద్దరు వూర్నుండి వచ్చారు. ఇద్దరూ పెళ్ళయిన వాళ్ళే. వాళ్ళు వచ్చినరోజున చంద్రం, ఉమేష్ గాడ్ని వెంటబెట్టుకు వచ్చాడు. ఉమేష్ గాడు రావడం. . . రావడం బైనాక్యులర్స్ మెడలో వేసుకుని మరీ వచ్చాడు.

రెండు గంటల నిరీక్షణ అనంతరం వంటగదిలో నీళ్ళ చప్పుడు విన్పించింది. శబ్ధ వినీ వినక ముందే ఉమేష్ గాడు ఆత్రంగా నేలమీదకిబడి, చకాలున బైనాక్యులర్స్ తో చూసేసి, ఒక్క క్షణంలో అంతే వేగంగా పైకి లేచాడు. ఆపైన “ఆడవాళ్ళని చూపిస్తానని తీసుకొచ్చి మగాళ్ళని చూపిస్తావా?” అంటూ, కోపంతో చంద్రం మీద విరుచుకు పడ్డాడు. తీరా చంద్రంగాడు పరిశీలించి చూసేసరికి అవతల స్నానం చేస్తున్నది పుష్ఫాంజలి వాళ్ళ బావ అని తేలింది. ఎలాగో వాడు ఉమేష్ కి నచ్చజెప్పుకున్నాడు. ఆపైన యింకో రెండు గంటలు వెయిట్ చేసి, ఎంతకీ పుష్ఫాంజలి స్నానం చేయకపోవడంతో, “మట్టి మొహంది. . .మట్టిముండ. . .స్నానం చేయదు. . .పాడూ చేయదు. . .ఆరోగ్యం ఏమైపోవాలి?” అని తిట్టుకుంటూ, “నేను ఈ రోజు కూడా మీ యింట్లోనే వుండి రేపు ఉదయం వెళతాన”న్నాడు ఉమేష్. నేను “కుదరదంటే కుదరద”న్నాను. చేసేదేంలేక వాడు పుష్ఫాంజలితో పాటు నన్నూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పుష్ఫాంజలి ఆరోజు సాయంత్రంవేళ స్నానం చేసింది.

మరోరోజు అప్పారావొచ్చాడు. అంతా చూసి, “ఆహా క్యా సీన్ హై!” అన్నాడు ఆనందపారవశ్యంతో.

వాడి ఆనందం చూసి, “ఇంతకీ పుష్పాంజలి అందగత్తేనంటావా?” అన్నాడు చంద్రం.

“నాకేం తెలుసు?” అన్నాడు అప్పారావు ఆశ్చర్యంగా.

“ఇప్పటిదాకా నువ్వు చూసిందేమటి?” అన్నాడు చంద్రం.

“నేను మొహం ఎందుకు చూస్తాన్రా భాయ్. మొహం చూడ్డానికొచ్చినానా యింత దూరం?” అన్నాడు అప్పారావు అమాయకంగా.

చివరకి అట్లా తయారయింది మా రూమ్ పరిస్థితి. నేను చేసేదేమీలేక జరిగేదేదో జరక్కపోదని భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించసాగాను.

* * *
(సశేషం)

Thursday, November 15, 2007

స్నానఘట్టం!..2

ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.
స్నానఘట్టం! (కథ)

నెలరోజులు గడిచాయి.

ఏదో అర్జెంటు పనుందని చంద్రంగాడు ఆరోజు ఉదయం ముందుగానే తయారై వెళ్ళిపోయాడు. ఎనిమిది గంటలప్పుడు నేనూ స్నానం చేసి, నడుముకి టవల్ చుట్టుకుని తలార్పుకుంటూ అద్దం ముందు నిల్చున్నాను. అవతల పుష్పాంజలి వాళ్ళ వంటగదిలోంచి ఎవరో యిల్లు వూడుస్తున్నట్టుగా చీపురుశబ్దం విన్పించసాగింది. క్రమంగా ఆ శబ్దం దగ్గరై తలుపుని సమీపించింది. యథాలాపంగానే నేను తలుపువేపు చూసాను.

అక్కడ క్రిందిభాగంలో తలుపుకి నేలకి మధ్య వున్న సందులోంచి నాలుగు చీపురు పుల్లలు మా గదిలోకొచ్చి కదలడం చూశాను. అంటే అవతలివైపు చీపురు కదలికలకి అనుగుణంగా ఆ పుల్లలు కదులుతున్నాయన్నమాట. నాకు చిత్రమనిపించింది. అంటే అక్కడేదో సందులాంటిది వుండి వుండాలి.

క్షణంలో నేను అద్దం దగ్గర నుండి కదిలి తలుపును చేరుకున్నాను. స్నానం చేసొచ్చిన విషయం కూడా మరిచి, నేలమీద బోర్లా పడుకుని పుల్లలు కదిలిన ప్రదేశంలో చూసాను. అక్కడ నేలకి తలుపుకి మధ్య గడప లేదు. అందువల్ల ఆ మధ్య ప్రదేశంలో తలుపు పొడవునా అడ్డంగా ఒక పెద్ద సందు వుంది. అవతల వంటగదిలో నేల తలుపు వరకూ ఎత్తులో వుండటం వల్లా, యిటు మా గదిలో పల్లంగా వుండటం వల్లా అది నాకు పడుకుని చూడడానికి బాగా వీలుగా కూడా వుంది. ఈ నేల ఎత్తుపల్లాల వ్యత్యాసం వల్ల అటువైపునుండి చూడడం సాధ్యం కాదు. అందుకే అక్కడి సందు విషయం పుష్పాంజలి వాళ్లు పసిగట్టలేక పోయారు. అంతకుమునుపు మేము రంధ్రాన్వేషణ చేసినప్పుడు మాకీ సందు కనిపించకపోవడానికి కారణం. . .బహుశా అప్పట్లో పుష్పాంజలి వాళ్లు అక్కడ ఏ చెక్క సామానో వాళ్ళకి తెలీకుండానే అడ్డుగా పెట్టివుంటారు. ఈ నెలరోజుల మధ్యలో ఎప్పుడో దాన్ని తొలగించివుండటం వల్ల, ఈ దారి ఏర్పడి వుంటుంది.

ఇకపోతే అక్కడ్నుంచి పుష్పాంజలి వాళ్ళ వంట గది పైకప్పు మినహా మొత్తం కన్పిస్తోంది. ఆ గదిలో మనుషులు నిల్చుంటే భుజాల వరకూ, కూర్చుంటే పూర్తిగానూ కనిపిస్తారు. ఆ గదిలోనే ఒక మూలగా సన్నటి గోడని నిర్మించి స్నానాల గదిగా మార్చుకున్నారు. ఆ ప్రదేశం కూడా నాకు దగ్గరగా, స్పష్టంగా కన్పిస్తోంది. అటువైపు ముందుగది కూడా నాలుగోభాగం కన్నిస్తూ వుంది.

అప్పుడు ఆ గదిని వూడుస్తున్నది పుష్పాంజలే. ఆమె అ క్షణంలో తలుపుకి దగ్గరగా వుండటం వల్ల నాకు మొదటగా ఆమె పాదాలు మాత్రమే కన్పించాయి.

పాదాలు. . .అవి పుష్పాంజలి పాదాలు. బంగారం రజనులో గులాబీ రేకుల్ని మిశ్రమం చేసి పోతపోసుకున్నట్టి మృదువైన పాదాలు. పసిడి రంగు పట్టీలు పెట్టుకుని, పారాణి దిద్దుకుని, పరికిణీ అంచున పదిలంగా నడిచే పాదాలు. వీక్షించువాడు భావకుడైతే, వీక్షించబడడానికి భావితాలై వేచివున్న పాదారవిందాలు. నా ప్రార్థననాలకించి, నా వేదన తీర్చడానికి పరమేశ్వరుడంపించిన పాదపద్మాలు.

నాకా క్షణం అద్బుతంగా తోచింది.

నేను చూస్తుండగానే ఆమె వూడ్చే కార్యక్రమం ముగించి, అవతలి గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజుకు చాలన్నట్టు నేను లేచి ఆఫీసుకి బయల్దేరాను.

* * *

ఆ మరుసటిరోజు ఉదయం నేను ఆరుగంటలప్పుడు లేచి, షేవింగ్ చేసుకోవడానికి ఉపక్రమించబోతుండగా అవతల వంటగదిలో నీళ్ళబిందె చప్పుడు వినిపించింది. చంద్రంగాడింకా నిద్ర లేవలేదు. నేను మెల్లగా, చప్పుడుగాకుండా తలుపు దగ్గరకి చేరాను. బోర్లాపడి చూడసాగాను.

నేజూసేసరికి పుష్పాంజలి చంకకెత్తుకున్న నీళ్ళబిందెని స్నానం చేయబోయే ప్రదేశంలో దించింది. మళ్ళీ లోనికెళ్ళి, బీరువాలోంచి ఇస్త్రీ బట్టలు తెచ్చుకుని వాటిని అక్కడేవున్న చిలక్కొయ్యకి తగిలించింది. ఆపైన జడని ముడి పెట్టుకుని స్నానానికుపక్రమించింది.

మొదటగా ఛాతీమీదనుండి ఓణీ తొలగించి ఓ మూలన పడేసింది. తర్వాత జాకెట్ విప్పింది. ఆపైన చేతుల్ని వెనక్కిపోనిచ్చి బ్రా హుక్స్ విప్పి, దాన్నికూడా శరీరం పైనుండి తొలగించింది.

అంతే. కదిపి వదిలిన పనసపండ్లలా అప్పుడు ఆచ్ఛాదనలేని ఆమె వక్షోజాలు నా కళ్ళముందు బరువుతో కదిలి పోసాగాయి. ఆ తర్వాత ఆమె పరికిణీ బొందు కూడా లాగేసింది. క్షణం తర్వాత ఆ పరికిణీ ఆమె పాదాలపైకి జారిపోయింది. దాన్నికూడా ఆమె ఆ మూలకి గిరవాటెట్టి, స్నానంకోసం పీటమీద కూర్చుంది. చెంబుతో నీళ్ళందుకుని తలపై కుమ్మరించుకుంటూ ఆపైన ఆమె స్నానం చేయసాగింది. అప్పటికి ఆమె నగ్నశరీరం పూర్తిగా నా కళ్ళముందు కదులుతోంది.

నీట తడిసిన వక్షస్థలం, కడుపు, తొడలూ, మోకాళ్ళూ, పిక్కలూ ఒకటేమిటి సర్వం. . .సర్వస్వం. . .నా కళ్ళముందు నగ్నంగా నర్తించసాగాయి.

అది నీట తడిసిన ఒక స్త్రీ శరీరం కాదు. నిలువెత్తు దేవతా ప్రతిమ. నేను వివశుడినై, విచలితుడనై వీక్షించసాగాను

పురుషుడు మనమున ఏది రచించుకొనునో, ఎట్టిది హృదయమున చిత్రించుకొనునో, ఎయ్యది అంతరమున భావించుకొనునో, ఏదది అంతస్సమున ధ్యానించుకొనునో. . .అట్టిది. . .అట్టి మహాద్భుత సౌందర్యదీప్తి. . .నా కనుల్ని లాగేసుకుంది.

ఖండ మఖండ మహత్తర తిక్త శృంగార మాధుర్య ఝరిలో ఆనాడు నా ప్రాణం పడి కొట్టుకుంది. పరితపించింది.

నిముషం గడిచింది.

చేతికి ఏదో తగిలినట్టు అన్పించడంతో ఉలిక్కిపడి పక్కకి చూసాను. ఎప్పుడు నిద్రలేచాడో యేమోగానీ, చంద్రంగాడు నా పక్కనే నేలమీద సాష్ట్రాంగపడి లోపలికి చూసేస్తున్నాడు. వాడే నా చేతికి తగిలింది.

(సశేషం)

Wednesday, November 14, 2007

స్నానఘట్టం!..1

ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.

స్నానఘట్టం! (కథ)

నేనూ చంద్రంగాడూ ఆ గదిలోకి అద్దెకి దిగిన నెలరోజుల వరకూ గ్రహించలేకపోయాం. . .మా గదికీ, వెనుక వైపు పుష్పాంజలి వాళ్ల పోర్షనులోకి తలుపు క్రిందుగా అవతలివేపుకి చూసేందుకు వీలుగా ఒక ‘సందు’ వుందన్న విషయం. అది గమనించిన రోజున మేం చూసిన దృశ్యాలూ, గడిపిన క్షణాలు మహత్తరమైనవి. శృంగార చరిత్రలోకి మళ్ళించదగినవి.

పుష్పాంజలికి పద్దెనిమిదేళ్ళుంటాయి. ఆమెకి తండ్రి లేడు. తల్లితో పాటే ఆ పోర్షనులో వుంటుంది. ఒకే యింటిలోని నాలుగు గదుల్లో రెండు గదులు వాళ్లకి, రెండు మాకు అద్దెకిచ్చాడు ఆ యింటి యజమాని. ఎవరి వాకిల్లు వాళ్లకేలా వాళ్ళ వాకిలి అటువేపునుంటే మాకు యిటువైపు వుంటుంది. మా లోపలి గదిలో వాళ్ళకీ మాకూ మధ్య అడ్డంగా వున్న తలుపుకి గడియ వాళ్ళ వేపుకే వుంటుంది.

వయసుకొచ్చిన ఆడపిల్ల యింట్లో వుండగా ‘బ్యాచిలర్స్’ మైన మాకు ఆ గదులు అద్దెకివ్వడం గురించి విని పుష్పాంజలి వాళ్ళ అమ్మ మొదట్లో యిష్టపడలేదట. మేం బుద్దిమంతులమైన కుర్రాళ్ళమనీ, పైగా ఒక పేరున్న కంపెనీలో వుద్యోగులం గనుక కాస్త భయమూ, భక్తీ కలిగివుంటామనీ ‘యింటి ఓనరే’ నచ్చజెప్పాక సమాధానపడిందట.

ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో ‘టీచర్’ గా పనిచేస్తుంది. వాళ్ళ ఆర్థిక స్థితి బాగా లేనందువల్ల, పుష్పాంజలి కూడా యింటర్ పూర్తిచేసిన తర్వాత అంతటితో చదువు చాలించి, ఈ మధ్యనే మరో కాన్వెంటులో ‘ట్యూటర్’ గా కుదిరింది. ఇద్దరికీ కలిపి లభించే నాలుగు వేల రూపాయల సంపాదనతోనే యింటి అద్దెతో సహా వాళ్ళకి అన్నీ గడవాలి. అందుకే వాళ్ళింట్లో వస్తువులేం పెద్దగా వుండవు. లేనితనం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.

పుష్పాంజలి పెళ్ళి వాళ్ళ అమ్మకో యుద్ద సమస్య! ఎందుకంటే వాళ్ళకి స్థిరాస్తులు ఏమీ లేవు. . . అప్పడెప్పుడో వాళ్ళ నాన్నగారు బతికుండగా కొనిపెట్టిన ఓ లక్ష రూపాయల విలువ చేసే యింటిస్థలం మినహా. పుష్పాంజలికి యిద్దరు అక్కలు. ఇద్దరికీ పెళ్ళయిపోయింది. అయితే వాళ్ళిద్దరికీ ఉద్యోగస్థుల్ని తీసుకొచ్చి పెళ్ళిచేయలేకపోయానని పుష్పాంజలి వాళ్ళ అమ్మకి ఒక వెలితి వుండిపోయిందట. అందుకే పుష్పాంజలికి మాత్రం చిన్న ఉద్యోగే అయినా, చివరకి ‘అటెండరే’ అయినా సరే ఉద్యోగినే తీసుకొచ్చి పుష్పాంజలికి పెళ్ళి జరిపించాలని వాళ్ళ అమ్మకి కోరికట. అందుకోసం తలా ఓ చెయ్యేసి పుష్పాంజలిని ఓ యింటిదాన్ని చేయమని ఆమె తన అన్నదమ్ముల్ని సహాయం అర్థించిందట. ఇవీ పుష్పాంజలి గురించి ఆ గదిలోకి వచ్చీరాగానే మాకు తెలిసిన విషయాలు.

ఇంటిలోని పేదరికం పుష్పాంజలి శరీరంలో దీపమెట్టి వెదికినా కనిపించదు. కోట్లు కుమ్మరించినా కొనలేని చక్కదనం ఆమెది. స్త్రీ శరీరంలో ఏ అవయవం ఎక్కడ వుండాలో, ఏ వంపు ఎక్కడ తిరగాలో మొత్తంగా తెలుసుకున్న ఏ దేవశిల్పో పనిగట్టుకుని రూపొందించినట్టు సన్నగా, నిండుగా, బంగారు తీవెలాగా వుంటుందామె శరీరం.

కుదిపితే చాలు కదిలిపోయి నాట్యంచేసే పొడవైన వాలుజడ. . .సుప్రభాత కాంతిన కన్పించే ఆకాశంలా విశాలంగావున్న నుదుటిమీద జ్వాలాకారంలో అగ్నిశిఖలా ప్రకాశించే సింధూర బొట్టు. . . మేఘాలఛాయ లాంటి కనురెప్పల మాటున అమృతమే వర్షిస్తున్నట్టు స్వచ్ఛంగా వుండే కళ్ళు. . .గులాబీల్ని గుర్తుకుతెచ్చి పలుచగా పారదర్శకంగా వుండే చెక్కిళ్ళు. . .చక్కగా, స్ఫుటంగా మొత్తం వ్యక్తిత్వానికే తార్కాణంలా అన్పించే పొడవైన ముక్కు. . .గడ్డిపోచ కదిలినా, ధూళికణం చెదిరినా బెదిరి అదిరే ఎరుపురంగు పెదాలు. . .నడిస్తే నడమంత్రంగా కాకుండా కాస్త పొందికగా, క్రమబద్ధంగా వూగే నడుము. . .నిల్చున్నప్పుడు చదునుగా వుండి, కూర్చున్నప్పుడు సన్నగా మడతపడే కడుపు. . .నిష్ఠూరంతో నిక్కబొడుచుకుని, నిండుగా ఎత్తుగా వుండి, “స్త్రీత్వానికి నేనే చిహ్నం” అన్నట్టు గర్విస్తుండే బిగుతైన రొమ్ము ద్వయం!

మొత్తం మీద వర్ణించడానికి వస్తువులు లేని శరీరం పుష్పాంజలిది!

అక్కడ అద్దెకి దిగిన మొదటిరోజునే మాకూ పుష్పాంజలి వాళ్ళకి అడ్డుగా వున్న తలుపుకి రంధ్రాలేమైనా వున్నాయేమోనని ఆ తలుపుని ప్రతి అంగుళం చొప్పున వెదికి వెదికి గాలించాం నేనూ చంద్రంగాడూ. రంధ్రమైతే ఒక్కటీ కన్పించలేదుగానీ, పుష్పాజలి వాళ్ళ అమ్మ ఎంత మర్యాదస్థురాలో, మరెంత జాగ్రత్తపరురాలో, యింకెంత సునిశితమైన దృష్టిగలిగిందో, ఆ విషయం మాత్రం అర్థమైంది మాకు క్షుణ్ణంగా. ఎందుకంటే, తలుపుకున్న రంధ్రాలన్నింటినీ శ్రద్ధగా వెదికి, ఓపిగ్గా కాగితాలంటించుకున్నారు వాళ్లు. ఆ విషయం కాస్త సజావుగా అర్థమయ్యేటప్పటికి మేం వెదుకులాట ప్రయత్నాలన్నీ తాత్కాలికంగా విరమించుకున్నా, క్యూరియాసిటీని మాత్రం చంపుకోలేకపోయాం. దానికో కారణం వుంది.

అదంతా ఒకే యిల్లు గనుక బాత్రూమ్ మా వైపుకే కట్టబడి వుంది. స్నానం కోసం బాత్రూమ్ కి రావాలంటే పుష్పాంజలి వాళ్లు మా పోర్షను వైపుకి రావాలి. నీళ్ళ బకెట్టుతో పాటు, టవలూ, ఇస్త్రీ బట్టలూ అన్నీ మోసుకుని ప్రతిరోజూ అట్లా రావడం కొంత శ్రమతోనూ, సమయంతోనూ కూడిన విషయం గనుక వాళ్ళు స్నానానికి యిటు రాకుండా అక్కడే వంటగదిలో ఏదో ఏర్పాటు చేసుకున్నారు.

ఈ విషయాలన్నీ మేం గ్రహించడం వల్లనే మాకూ వాళ్లకూ అడ్డుగా వున్న తలుపునట్లా అణువణువు పర్యంతం రంధ్రాన్వేషణ చేయడం జరిగింది. మేం చేస్తున్న పని తప్పని మాకూ తెలుసు. కానీ, పుష్పాంజలి వంటి ‘పుడమి పుష్పం’ పది అడుగుల దూరంలో పన్నీటి స్నానాలు చేస్తుంటే పట్టనట్టు కూర్చోవడానికి మేం పసివాళ్ళమూ కాదు. . .ప్రాయముడిగిన వృద్ధులమూ కాదు. ఎవరేమన్నా, ఏమనుకున్నా.
* * *
(సశేషం)